Advertisement
రోడ్డుమీద మనం వెళ్ళినప్పుడు మనకి డబ్బులు కనపడుతూ ఉంటాయి. డబ్బులు తీసుకోవచ్చా ఈ విషయం పై చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మరి నిజంగా రోడ్డుమీద వెళ్లినప్పుడు డబ్బులు కనపడితే వాటిని తీసుకోవచ్చా..? తీసుకోకూడదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవి రూపాయి కాసులైన లేదంటే నోట్లు అయినా తీసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఆ డబ్బులు తీసుకెళ్లి దేవాలయంలో కానీ ఏమీ లేని వాళ్ళకి కానీ ఇచ్చేయచ్చు. నిజానికి వాస్తు ప్రకారం రోడ్డు మీద పడి ఉన్న డబ్బులు ని చూడడం శుభప్రదం.
Advertisement
Advertisement
ఏదైనా పనికి వెళుతున్నప్పుడు మనకి డబ్బులు కనపడితే, అది చాలా మంచి చిహ్నం. వెళ్లే పని విజయవంతం అవుతుందని దానికి సంకేతం. పని నుండి తిరిగి వస్తున్నప్పుడు కనపడితే త్వరలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నట్లు దానికి అర్థం. ఒకవేళ కనుక మీకు దొరికిన డబ్బులు మీరు ఇంటికి తీసుకువెళ్లినట్లయితే దానిని ఖర్చు చేయకుండా బీరువాలో కానీ పర్సు లో కానీ పెట్టుకోవచ్చు ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఇలా మీకు రోడ్డు మీద దొరికిన డబ్బుని జాగ్రత్తగా అవసరమైన వాటి కోసం ఖర్చు చేస్తే కూడా మంచి జరుగుతుంది కాబట్టి రోడ్డు మీద వెళ్లినప్పుడు డబ్బులు కనిపిస్తే తీసుకోవచ్చు. అందులో తప్పు ఏమీ లేదు.
Also read: