Advertisement
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. జాబిల్లిపై ఉన్న వాతావరణం మరియు భూమి ఏ విధంగా ఉందనే విషయంపై అధ్యాయనం జరుగుతుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపిన నాలుగో దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో యావత్ ప్రపంచం దృష్టి చందమామపై పడింది. ఇప్పటికే పలువురు భారత సెలబ్రిటీలు సైతం చందమామపై భూమి కొనుగోలు చేసినట్లు సామాజిక మాధ్యమంలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ మరియు లూనా సొసైటీ ఇంటర్నేషనల్ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకుని పేమెంట్స్ చేయడం ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులకు రిజిస్టర్ చేసుకున్న అనంతరం సంబంధిత ధ్రువపత్రాలు పొందవచ్చట. లూనార్ రిజిస్ట్రీ ప్రకారం.. చంద్రుడిపై ఎకరం భూమి విలువ 37.50 డాలర్ల వరకు ఉంటుందని, భారత కరెన్సీలో రూ.3200 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇంత తక్కువ ధర ఉండడంతో చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Advertisement
దీనితో ప్రస్తుతం చంద్రునిపై భూమి అమ్ముతున్నారని, కొందరు కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారనే వార్తలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. ఇక చాలా తక్కువ ధరకు చందమామపై భూమి కొనుగోలు చేయవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. మరి నిజంగానే చంద్రునిపై భూమి కొనవచ్చా..? ఇది నిజంగా సాధ్యమేనా..? ఇందులో అసలు వాస్తవాలు ఏమిటి..? అనే విషయాలపై రక్షణ, ఏరోస్పేస్ నిపుణులు భిన్నాభిప్రాయలు వ్యక్తపరుస్తున్నారు.
1967లో అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం భూమి ఆవతల ఉన్న ఏ ప్రాంతంపైనైనా ఒక వ్యక్తికి గాని, ఒక దేశానికి గాని ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండబోవు. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 110 ఇతర దేశాలు కూడా సంతకం చేశాయట. ఈ ఒప్పందం మేరకు భూమి ఆవతల ఎక్కడ, ఎవరు కొనుగోలు చేసినా వారి పేరు మీద ఉంటుంది తప్ప.. వారికి చట్టపరంగా ఎలాంటి యజమాన్య హక్కులు వర్తించవు. అలాగే చంద్రుడిపై పూర్తిగా నివాస యోగ్య పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read