Advertisement
vaastu-tips in Telugu: వస్తు రూపేణ వాస్తు అన్నారు పెద్దలు. వాస్తు ప్రకారం చూసుకుంటే ప్రతి ఇంటికి ఈశాన్యం ముఖ్యమే. అందుకే ఈశాన్యంలో బరువు ఉండకూడదని చెబుతుంటారు. ఇంటి నిర్మాణంలో ఈశాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్యాన్ని సరైన విధంగా ఉంచుకోకపోతే మనకు నష్టాలే. ఈశాన్యం దిక్కుకు ఆధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగానూ, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కాబట్టి ఈ దిశలో నీరు లేదా బావి ఉండడం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
Advertisement
Read also: తిరుమల వెంకటేశ్వర స్వామి కి “వడ్డికాసులవాడు” అని పేరు ఎలా వచ్చింది ? ఆ కథ ఇదే !
Advertisement
ఈ నేపథ్యంలోనే ఈశాన్యం ఎలా ఉంచుకోవాలో వాస్తు శాస్త్రం చెబుతోంది. సంపాదన పెరగాలంటే ఈశాన్యం దిక్కులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. చిన్న చిన్న పొరపాట్లతో మన సంపాదన పై పేను ప్రభావం పడుతుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి. మనకి దిక్కులు నాలుగు.. అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే విధిదిక్కులు నాలుగు.. అవి ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. ఈ అష్టదిక్కుల అధిపతులకు సంబంధించిన వస్తు సామాగ్రిని మన ఇంట్లో ఆయా నిర్దిష్ట స్థలాలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరుగుతుంది.
ఈశాన్యభాగం అనేది మన శరీరంలో ఆక్సిజన్ వంటిది. ఆ ఈశాన్య భాగాన ఎటువంటి బరువు అనేది పెట్టకూడదు. ఈశాన్య భాగంలో ద్వారబంధం గానీ, కిటికీ గాని ఏర్పాటు చేసుకోవాలి. ఇక కొత్తగా ఇంటిని నిర్మించుకునే ముందు కానీ, లేదా నిర్మించిన ఇంటిని కొనుక్కునే ముందు కానీ ఆ ఇంటి సమీపంలో స్మశానాలు, హాస్పిటల్స్, టెంపుల్స్, చెరువులు, బావులు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇక వాస్తు అంటే ఇల్లు కాదు వస్తువులు కూడా.. ఏ వస్తువును ఎక్కడ ఉంచుకోవాలో కూడా వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. పక్కా వాస్తు ప్రకారం మన వస్తువులు అమర్చుకుంటే మేలు కలుగుతుంది. లేదంటే ఇబ్బందులు వస్తాయి.
R