Advertisement
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్ తెలంగాణాలో బలంగా నాటుకుపోయింది. అయితే.. రాజకీయంగా ఎదగడానికి, కేసీఆర్ సర్కార్ పై విజయం సాధించడానికి రేవంత్ రెడ్డి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన చాలా కేసుల్లో ఇరుక్కోవడం, వాటి నుంచి బయట పడడం జరిగింది. కేసీఆర్ స్వతహాగా ఏ రాజకీయ నాయకుడిని పని కట్టుకుని టార్గెట్ చెయ్యలేదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది.
Advertisement
రేవంత్ రెడ్డిని కేసీఆర్ చాలా సార్లు టార్గెట్ చేసారు. రేవంత్ రెడ్డి పై చాలా కేసులే పెట్టారు. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం . రాజకీయ నాయకులూ వీటిని లైట్ తీసుకుంటారు కూడా. కానీ, రేవంత్ రెడ్డి మాటలని మాత్రం కేసీఆర్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆయన మాటలకు ప్రతిసారి ఓ కేసు అన్నట్లు కేసీఆర్ సర్కార్ బిహేవ్ చేసింది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డిపై అక్షరాలా 89 కేసులు నమోదయ్యాయట. వీటిల్లో చాలా కేసులు కేసీఆర్ ప్రభుత్వానికి ఎగైనెస్ట్ గా మాట్లాడడం వల్లనే అని భోగట్టా.
Advertisement
ఎన్నికల అఫిడవిట్ లో రేవంత్ రెడ్డి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనడంతో అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు. అయితే ఈ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. 89 కేసులలో, 34 అభియోగాలు IPC సెక్షన్ 506 (నేరమైన బెదిరింపులకు శిక్ష)కి సంబంధించినవి; 38 మంది IPC సెక్షన్ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వక అవమానం)కి సంబంధించినవి; 21 IPC సెక్షన్-153కి సంబంధించినవి (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం); మరో 17 కేసులు IPC సెక్షన్ 188కి సంబంధించినవి ; 12 కేసులు IPC సెక్షన్ 341కి సంబంధించినవి (తప్పుడు నిర్బంధానికి శిక్ష); మరియు 12 మంది IPC సెక్షన్ 34కి సంబంధించినవి (ఉమ్మడి ఉద్దేశ్యంతో అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు) కింద నమోదు అయ్యాయి.
Watch Video: