Advertisement
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న రిలీజ్ అయితే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ఒకరోజు వ్యవధితో విడుదలైంది. ఇక వీర సింహారెడ్డి సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ అన్ని కలగలిపి ఉన్నాయని ఇప్పటికే మంచి టాక్ వినిపించింది. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఫస్ట్ హఫ్ లో నవ్వులు, ఎమోషన్స్ కలగలిపి ఉన్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం చిరంజీవి, రవితేజ ఇద్దరు హీరోలు ఎంటర్ అయ్యాక ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
Advertisement
మొత్తానికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఓపెనింగ్ వసూళ్లలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీ కంటే ఎక్కువ వసూలు నమోదు చేసింది. కానీ, ఇప్పుడు వాల్తేరు వీరయ్యనే దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంచితే, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యను రాష్ట్రంలోని ఓ కుల ఆధారిత వెబ్ సైట్లు టార్గెట్ చేసినట్లు మనకు కనిపిస్తోంది.
Advertisement
వీరసింహారెడ్డి కంటే, వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువగా వసూళ్లు రాబట్టినా, కొన్ని కుల ఆధారిత వెబ్సైట్లు మాత్రం, చిరంజీవి సినిమాకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తూ, మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నాయట. ఈ సంక్రాంతికి నందమూరి సినిమా హిట్ అనే ప్రచారం జోరుగా చేస్తున్నాయట. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కాకముందు నుంచే ఈ ప్రచారం సాగిస్తున్నాయని టాక్. కానీ, సంక్రాంతి విన్నర్ గా చిరు సినిమానే నిలిచిందని ఓ వర్గ మీడియా తెలపటం గమనార్హం. ఏది ఏమైనా, సినిమాను సినిమాగానే చూడాలని సగటు ప్రేక్షకుడు అనుకుంటున్నారట.
Read also: సంక్రాంతి బరిలో విడుదలై డిజాస్టర్లు గా మిగిలిన సినిమాలు ఏవంటే ?