Advertisement
మొయినాబాద్ ఫాంహౌస్ కేసు హైకోర్టులో నలుగుతోంది. కేసును సీబీఐకి అప్పగించడంపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లగా.. ఈడీ ఎంట్రీపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అప్పీల్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పు పై ప్రభుత్వ అప్పీల్ దాఖలు చేయడంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. ప్రభుత్వ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
Advertisement
ఇటు తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ గండ్ర మోహన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాన్ని రద్దు చేసి సీబీఐకు అప్పగించడం సరికాదన్నారు. ఇక నిందితుల తరఫున వాదనలు వినిపించిన సీతారాంమూర్తి అప్పీల్ పిటిషన్ అసలు మెయింటేనబుల్ కాదని కోర్టుకు తెలిపారు.
Advertisement
మరోవైపు హైకోర్టు ఆర్డర్ కాపీ సీబీఐ చేతికి అందింది. దీంతో సీబీఐ ఏక్షణమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీనీ సీబీఐ న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చాక ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి కొందర్ని విచారించింది. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు సీబీఐ రాకతో కేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారే అవకాశం ఉంది.