Advertisement
సెలబ్రిటీల వివాహాలకు అయ్యే ఖర్చు లెక్కలు చుక్కల్లో ఉంటాయి. మరి వారి విడాకుల విషయం కూడా కాస్ట్లీనే. కారణం చిన్నదైనా, పెద్దదైనా కాంప్రమైజ్ అయ్యి బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. పిల్లలు ఉన్న, ఏ వయసైనా విడిపోవాలని ఆలోచన వస్తే విడిపోవడమే. అయితే సెలబ్రిటీలుగా కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్లు తమ మాజీ భార్యలకు భారీగా భరణం ముట్ట చెప్పారు. మరి సెలబ్రిటీల లైఫ్ లో జరిగిన కాస్ట్లీ విడాకుల గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1 ప్రభుదేవా-రమాలత:
కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తన భార్య రమాలతకు 2011లో విడాకులు ఇచ్చారు. 2009లో నయనతారతో ఎఫైర్ పెట్టుకున్న ప్రభుదేవా, ఆమెను పెళ్లి చేసుకోవడానికి రమాలతకు విడాకులు ఇచ్చారు. ఈ విడాకుల వ్యవహారంలో 25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, ఖరీదైన కార్లు, కొంత డబ్బు రమాలత భరణంగా తీసుకున్నారట. ఇంత చేసి పాపం నయనతారను ఆయన పెళ్లి చేసుకుంది లేదు.
#2 హృతిక్ రోషన్-సుస్సనే ఖాన్:
2000 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్-సుస్సనే ఖాన్ 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ కి హీరోయిన్స్ తో ఉన్న అక్రమ సంబంధాలను సాకుగా చూపి ఆమె విడాకులు కోరింది. ఈ విడాకుల వ్యవహారంలో ఏకంగా 400 కోట్లు ఆమె భరణంగా అడగడం విశేషం. వీరికి ఇద్దరు పిల్లలు కాగా విడాకుల తర్వాత ఈ మధ్య సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు.
Advertisement
#3 అమీర్ ఖాన్-రీనా దత్ :
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ నీ ప్రేమ వివాహం చేసుకున్నారు. కారణం ఏదైనా 2000 లో విడాకులు తీసుకొని వీరిద్దరు విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ సమయంలోనే విడాకుల భరణం క్రింద 10 కోట్ల వరకు రీనా దత్ తీసుకున్నారట. ఆ తర్వాత అమీర్ ఖాన్ 2005లో కిరణ్ రావు ని పెళ్లి చేసుకున్నారు.
#4 సంజయ్ దత్-రియా పిళ్లై:
1996 లో తన మొదటి భార్య రీఛాశర్మ మరణించిన తర్వాత 1998 లో రియా పిళ్లై నీ సంజయ్ దత్ వివాహం చేసుకున్నారు. పదేళ్ల కాపురం తర్వాత 2008లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీనితో 2008లో విడాకులు తీసుకున్నారు. ఇక సంజయ్ దత్ రియాపిళ్లై కు భరణం కింద 8 కోట్ల రూపాయలు ఇచ్చారట. అదే ఏడాది సంజయ్ దత్ మాన్య దత్ ని మూడో వివాహం చేసుకున్నారు.
#5. సైఫ్ అలీ ఖాన్-అమృత సింగ్:
1991 లో హీరోయిన్ అమృత సింగ్ ని, సైఫ్ అలీ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సారా ఆలీ ఖాన్, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పటౌడి వంశానికి చెందిన సైఫ్ నుండి అమృతకు భరణం రూపంలో బాగానే దక్కిందట. ఇక 2012లో సైఫ్ హీరోయిన్ కరీనా కపూర్ నీ పెళ్లి చేసుకున్నారు.
READ ALSO : వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !