Advertisement
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్, పాటలతో తెగ సందడి చేస్తున్నాడు. అయితే.. వివాదాలతో కాలం గడుస్తోంది. ట్రైలర్ కన్నా.. బేషరం రంగ్ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. ఓవర్ ఎక్స్ పోజింగ్, డ్రెస్సింగ్ పై అగ్గి రాజుకుంది. సినిమాను బ్యాన్ చేయాలనే వరకు వెళ్లింది. కొందరు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి అండగా నిలబడ్డారు. అయితే.. వివాదం రాజకీయం రంగు పులుముకోవడంతో మరింత తీవ్రమైంది.
Advertisement
షారుఖ్ దిష్టిబొమ్మలను దహనం చేయడం.. సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో వివాదాల్లో చిక్కుకున్న ఈ పఠాన్ చిత్రంలో మార్పులు చేయాల్సిందేనని సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పాటలో మార్పులు చేయాలని.. లేని పక్షంలో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు హెచ్చరించారు. మూవీని ప్రదర్శించే సినిమా హాళ్లను తగులబెడతామని హిందూ సేన తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాటలో మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి ఆదేశించారు.
Advertisement
తమ గైడ్ లైన్స్ మేరకు సినిమాలో మార్పులు చేసి.. ఆ వెర్షన్ ను సమర్పించాలని సూచించారు. అయితే.. మార్పులు చేయాలన్న విషయానికి సంబంధించి ఆయన వివరాలు తెలియజేయలేదు. మూవీలో సినీ దర్శకుల క్రియేటివిటీకి, ఆడియెన్స్ సెంటిమెంట్లకు మధ్య బ్యాలన్స్ అన్నది ఉండాలని చెప్పారు. భారత సంస్కృతి గొప్పదన్న విషయం మరువరాదని తెలిపారు.
సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలను వెంటనే తొలగించాలని సూచించారు. తాము చెప్పిన విధంగా మార్పులు చేయాల్సిందేనని ఆదేశించారు. సెన్సార్ బోర్డు సూచననుసరించి ఇందులో మేకర్స్ ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి.