Advertisement
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం గతంలో రద్దు చేసిన విషయం విధితమే. ఇటీవలే సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించేంత వరకు అనర్హుడిగానే పరిగణించాలని లక్నోకి చెందిన న్యాయవాది అశోక్ పాండే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దొంగలు అందరికీ మోడీ ఇంటి పేరు ఎందుకు అనే వ్యాఖ్యలపై దాఖలు అయిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షను గతంలో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ్యత్వం పునరుద్దరించబడింది. తాజాగా న్యాయవాది అశోక్ పాండే కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఎన్నికల అక్రమాల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లోనే ఉన్నా.. రాహుల్ విషయంలో మాత్రం కోర్టుల్లో విచారణ వేగంగా ముగిసి తీర్పు వెలువడటం వెనుక కేంద్రం హస్తం ఉందన్న అనుమానాలు నాడే వ్యక్తమయ్యాయి. ఇలా కోర్టు తీర్పు రాగానే అలా ఆయనను లోక్ సభ సభ్యుడిగా అనర్హుడు అంటూ లోక్ సభ సెక్రటేరియెట్ నిర్ణయం తీసేసుకుంది.
తెలంగాణలో 2018లో ఎన్నికల అఫిడవిట్ తో తప్పుడు వివరాలు సమర్పించారంటూ దాఖలైన దాదాపు డజన్ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. అటువంటిది.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విచారణ పూర్తై తీర్పు కూడా వెలువరించడం ఏమిటని సూరత్ కోర్టు తీర్పు వెలువడిన సమయంలోనే పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read :
“ఇండియా” నుంచి “భారత్” గా పేరు మారితే ప్రజలు మళ్లీ వాటికి క్యూ కట్టాల్సిందే నా?