Advertisement
ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. ఆయన తన చాణక్యనీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా స్త్రీల గురించి అనేక విషయాలు చెప్పారు. పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులు ఎలాంటి లక్షణాలున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందో వివరించారు. ఆచార్య చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారు చాలా అదృష్టవంతులు అవుతారని ఆయన తన నీతి శాస్త్రంలో అన్నారు.. మరి ఆ స్త్రీలు ఎవరు?వారి లక్షణాలు ఏంటో చూద్దాం..
సహనం కలిగిన స్త్రీ:
ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే పురుషుడి జీవితం చాలా ఆనందంగా ఉంటుందని, కోపంగా పురుషుడు ఏమైనా కోప్పడినా ఆ స్త్రీ అర్థం చేసుకొని సహనంతో మెదులుతుందని అన్నారు.
Advertisement
also read: యూట్యూబ్ క్లాస్ లు వింటూ MBBS సీటు కొట్టింది.. హారిక ఎలా సాధించిందో తెలుసా?
Advertisement
ధర్మాన్ని ఆచరించే స్త్రీ :
ఇలాంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం వైపు వెళ్ళరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ధర్మాన్ని ఆచరిస్తారు.
ప్రశాంతంగా ఉండే స్త్రీ :
ఈ స్త్రీలు ఎప్పుడు కూడా తొందరపడకుండా ప్రశాంతంగా ఉంటారట. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే పురుషుడికి చాలా సుఖం దొరుకుతుందని చాణిక్యుడు అన్నారు.
మధురంగా మాట్లాడే స్త్రీ:
ఇలాంటి స్త్రీలు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట. వారి మాటలతో మెస్మరైజ్ చేస్తారట.
పెద్దల్ని గౌరవించే స్త్రీ:
ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల పురుషుడికి కూడా గౌరవం పెరుగుతుందని ఆచార్య చాణిక్యుడు అన్నారు.
also read:కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!!