Advertisement
తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతువులకు సంపాదించినా చేప నూనెలను వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పించారు. దీనిపై సిట్ ఏర్పాటయింది. సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐసి సర్వ శ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో.. డీఐజీ గోపినాథ్ జెట్టి. కడప జిల్లా పోలీస్ సూపర్డెంట్ వి. హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, డిప్యూటీ ఎస్పీలు, జి సీతారామరావు, జే శివ నారాయణ స్వామి, అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇలా పలువురుతో టీం ఏర్పాటయింది.
Advertisement
Advertisement
ప్రధానంగా తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఏఆర్ డైరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. మూడవరోజు విచారణలో భాగంగా తిరుమలలో ఉన్న టీటీడీ కి చెందిన ఫ్లోర్ మిల్, లేబరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోర్ట్ ను అధికారులు తనిఖీ చేశారు.
Also read:
నెయ్యి నమూనాలను కూడా సేకరించారు. ఈ నెల మూడవ తేదీ దాకా తిరుపతిలో గల పోలీస్ గెస్ట్ హౌస్ కు పరిమితం అవ్వచ్చని.. అప్పటి దాకా ఎలాంటి విచారణ చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లుగా అనుమానించిన ఏఆర్ డైరీ సహా ఇతర ప్రాంతాల్లో దర్యాప్తుకు సైతం తాత్కాలిక బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!