Advertisement
చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీ లేని రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల నిధులతో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించడానికి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడానికి ఏపీలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
Advertisement
ఏపీలో ఎంఎస్ఎమ్ఈలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఎస్ఎమ్ఈల ప్రోత్సాహానికి త్వరలోనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వాళ్లకోసం ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా టీసీఎస్ రూపొందిస్తున్న ఎంఎస్ఎమ్ఈ వన్ యాప్ ని రెండు నెలలు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు.
Advertisement
Also read:
Also read:
ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలో రెండు చొప్పున 50 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!