Advertisement
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మొత్తం విశాఖ పట్నం ముచ్చటే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడో రోజు కూడా భారీగా పోలీసులు మోహరించే ఉన్నారు. మరి పవన్ ముందు అనుకున్న షెడ్యూల్ వరకు వైజాగ్ లోనే ఉంటారా, లేక విశాఖను వేడి వెళ్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో,
Advertisement
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారు. చాలాకాలం తర్వాత వీరిద్దరి మధ్య మాటలు జరిగాయి. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఏర్పడిన వివాదాలు, పోలీసుల ఓవరాక్షన్, వైసీపీ నేతల వ్యాఖ్యలు వంటి వాటిపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం పోరాడే విషయంలో ఇరువురు సలహాలు ఇచ్చి పుచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సమయంలో వీరి మధ్య ఫోన్ సంభాషణ వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది.
Advertisement
పవన్, చంద్రబాబు మాట్లాడుకునే సందర్భాన్ని వైసీపీనే సృష్టించినట్లు అయింది. పవన్ ఏం చేసిన చంద్రబాబు చెప్పినట్లుగానే, చంద్రబాబు కోసమే చేస్తున్నట్లుగా విమర్శలు చేసే వైసిపి నేతలకు, ఇప్పుడు నేరుగా పవన్ తో చంద్రబాబు మాట్లాడటం మరింత ఆనందం కలిగించవచ్చు. కానీ ఈ ఫోన్ కాల్ రాజకీయాల్లో కీలక మలుపు అయ్యే అవకాశం ఉంది. టిడిపి తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారు. ప్రజా పోరాటాల్లో కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బిజెపి శాసనమండలి పక్ష నేత పివిఎన్ మాధవ్ నేతృత్వంలోని బిజెపి బృందం పవన్ కళ్యాణ్ ను కలవనుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ ఒంటెద్దు పోకడకు నిదర్శనమని మండిపడ్డారు బిజెపి నేతలు.
READ ALSO : టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ & టీ విరామ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు?