Advertisement
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సంబంధిత గనుల శాఖ అధికారులపై మండిపడ్డారని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం మదనపల్లి రెవెన్యూ పరిధిలో శ్రీ బండపల్లి పరిధిలో ఆక్రమంగా నిర్వహించిన క్వారీల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లె రెవెన్యూలోని సర్వేనెంబర్ 144లో సుమారు 660 ఎకరాల విస్తీర్ణంలో అడవిలో అక్రమంగా విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయట. అయితే ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం లో సుమారు 30 మంది ఆక్రమంగా నిర్వహించారని అధికారుల విచారణలో తెలిసింది.
Advertisement
Advertisement
చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన మాజీమంత్రి మనుషులు లక్షల లక్షల రూపాయలని వెనకేసుకున్నారని ఈ మేరకు ఆరోపణలు వచ్చాయి. ప్రతీసారీ 50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు వైసీపీ పెద్దాయనకు చెల్లిస్తున్నారని ఆక్రమ వ్యవహారాల జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయారని కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడుకి చెప్పారు. ఈ వ్యవహారం గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడుకు తెలిసినా వైసీపీ ప్రభుత్వం అధికారం ఉండడంతో అడ్డుకోలేకపోయారట.
Also read:
ఏపీలో వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాల గురించి వరద బాధితుల గురించి వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు ఈ సమయంలోనే ఈ అక్రమంగా జరుగుతున్న క్వారీల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారని అధికారులు హడలిపోయారు. ఏపీ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి పరారీలో ఉండడంతో ఆయన చిక్కితేనే కుప్పం వ్యవహారంలో క్లారిటీ వస్తుందని అధికారులు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!