Advertisement
మనం టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లిస్తూ ఉంటాం. అయితే మనం గవర్నమెంట్ కి రోడ్ టాక్స్ కడుతున్నప్పుడు ఈ టోల్ ప్లాజా వద్ద ఈ డబ్బు ఎందుకు చెల్లించాలి? అసలు టోల్ ప్లాజా రూల్స్ ఏంటో ఒకసారి చూడండి..? ముఖ్యంగా టోల్ ప్లాజా లు పెద్ద పెద్ద నగరాలను కలిపే రోడ్లు, నేషనల్ హైవే లు, అవుటర్ రింగ్ రోడ్డు లపైన ఉంటాయి. టోల్ ప్లాజా దగ్గర ఉన్న రోడ్లు చాలా నీటుగా, వెడల్పుగా 100 స్పీడులో వెళ్లే విధంగా ఉంటాయి. ఇలా వేల కిలోమీటర్లు ఉండే ఈ హైవేలను నిర్మించాలంటే వేల కోట్లు కావాలి.
Advertisement
ప్రభుత్వాలు Build-own-operater-transfer అనే విధానాన్ని పాటిస్తుంది.అంటే రోడ్డును సొంత డబ్బులతో నిర్మించడం. అయితే కొన్ని కంపెనీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొంతంగా ఈ రోడ్లను నిర్మించి కొన్ని సంవత్సరాల పాటు 60 కిలోమీటర్లు ఒక టోల్ ప్లాజా ను పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తారు. అలా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మళ్లీ ఆ రోడ్లను గవర్నమెంట్ కు ఇస్తాయి. అయితే మనం టోల్స్ కడతాం కాబట్టి కొన్ని సర్వీసులను టోల్ ప్లాజా కంపెనీలు అందిస్తాయి.
Advertisement
హైవే లో ఏదైనా ప్రాబ్లం వచ్చి కారు ఆగిపోయినా, పెట్రోల్ అయిపోయినా, ఇంకేమైనా సమస్య వచ్చినా టోల్ స్లిప్ పై ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి వారి సహాయం తీసుకోవచ్చు. హైవేపై యాక్సిడెంట్ అవ్వడం, ఇంకేదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫోన్ చేసి ఆంబులెన్స్ పెసిలీటీని వాడుకోవచ్చు. అలాగే ఫైర్ సర్వీసులు కూడా వాడుకోవచ్చు. ఇందులో మరొకటి కూడా ఉంటుంది మనం టోల్ టాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మన పని టెన్ సెకండ్స్ లో అయిపోవాలి. అంతకు మించి సమయం పడితే టోల్ కట్టకుండా కూడా వెళ్ళిపోవచ్చు. టోల్ ప్లాజా వద్ద వంద మీటర్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలను తీసుకోకుండా స్పీడ్ గా పంపించాలి.
also read;