Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలయ్య లకు మంచి క్రేజ్ ఉంది. అటు మెగా ఫ్యామిలీ ఇటు నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ వారి సినిమాలను బాగా ఆదరిస్తారు. అలాంటిది.. ఒకేసారి చిరంజీవి మరియు నందమూరి బాలయ్య సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా.. అప్పుడు ఫాన్స్ కు రచ్చ రచ్చే. అయితే ఒకేసారి వీరిద్దరి సినిమాలు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Also Read: “స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?
#1 చట్టంతో పోరాటం – ఆత్మబలం
ఈ రెండు సినిమాలు 1984లో ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. ఆ రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. చిరు సినిమా హిట్ కొడితే బాలయ్య బాబు సినిమా యావరేజ్ గా నిలిచింది.
#2 భార్గవ రాముడు – దొంగ మొగుడు
ఈ రెండు సినిమాలు 1987లో వచ్చాయి. రెండు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
#3 కథానాయకుడు – రుస్తుం
ఈ రెండు సినిమాలు 1984లో వచ్చాయి. కథానాయకుడు సినిమా బాలయ్య బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ . ఓ సక్సెస్ ఫుల్ హీరోగా బాలయ్యను నిలబెట్టింది. మరోవైపు రుస్తుం సినిమా మాత్రం అంతగా ఆడలేదు.
#4 ముద్దుల కృష్ణయ్య – మగధీరుడు
బాలకృష్ణ సినిమా ముద్దుల కృష్ణయ్య విడుదలైన వారానికి మెగాస్టార్ మగధీరుడు సినిమా రిలీజ్ అయింది. మగధీరుడు యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
#5 మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టు
Advertisement
ఈ రెండు సినిమాలు 1984 లో వచ్చాయి. ఫస్ట్ టైం బాక్సాఫీస్ క్లాస్ అయిన సినిమాలు ఈ రెండే. బాలకృష్ణ యాక్ట్ చేసిన మంగమ్మగారి మనవడు సినిమా సూపర్ హిట్ అయింది. చిరంజీవి ఇంటి గుట్టు సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
#6 నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా
ఈ సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసాయి. ఈ రెండు సినిమాలు 1986లో వచ్చాయి.
#7 రాము – పసివాడి ప్రాణం
ఈ రెండు సినిమాలు 1987 లో వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి టాక్ నే తెచ్చుకున్నాయి. పసివాడి ప్రాణం సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
#8 పెద్దన్నయ్య – హిట్లర్
1988 లో క్లాష్ అయ్యాక, మళ్లీ పదేళ్ల తర్వాత ఈ సినిమాలతో బాలయ్య చిరు క్లాష్ అయ్యారు. ఈ రెండు సినిమాలు 1997లో వచ్చాయి ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. హిట్లర్ మూవీతో మెగాస్టార్ అప్పట్లో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చారు.
#9 అపూర్వ సహోదరులు – రాక్షసుడు
ఈ రెండు సినిమాలు 1986లో వచ్చాయి. ఈ సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి.
#10 ఇన్స్పెక్టర్ ప్రతాప్ – మంచి దొంగ
ఈ రెండు సినిమాలు 1988లో వచ్చాయి. ఈ రెండు మాస్ హిట్లు కొట్టాయి. ఈ రెండు సినిమాల్లోనూ విజయశాంతి హీరోయిన్.
#11 నరసింహనాయుడు – మృగరాజు
ఈ రెండు సినిమాలు 2001 లో వచ్చాయి. బాలయ్య బాబుకు సింహా టైటిల్ కలిసి రావడం అనేది అప్పటి నుంచే ఉంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే, అంచనాలు అందుకోలేక మృగరాజు మాత్రం హిట్ కాలేదు.
Also read: SR ఎన్టీఆర్ కు ఒక్క హైదరబాద్ లోనే ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయో తెలుసా..?