Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి మెగాస్టార్ గా మారాడు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు నిర్మించి విజయం అందుకున్నాడు. చిరంజీవి కంటే ముందు ఆయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు తీసి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవితో సినిమాలు తీసాడు.
Advertisement
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 04.09.2022
ఘరానా మొగుడు సినిమా విజయవంతమైన తరువాత మరో సినిమా కూడా చిరంజీవితోనే తీయాలని చాలా కాలం ఎదురు చూసి మరో రెండు సంవత్సరాల తర్వాత ఇవివి సత్యనారాయణ కాంబినేషన్లో దేవి వరప్రసాద్ నిర్మాతగా అల్లుడా మజాకా మూవీ చేశాడు. ఈ మూవీ చిరంజీవి మరియు ఈ.వి.వి సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. దీనికి పోసాని కృష్ణమురళి కథకుడు కాగా, ఇందులో అత్త పాత్ర మొదట వాణిశ్రీ అని అనుకున్నారట. కానీ ఆమెకు డేట్లు లేకపోవడంతో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ని ఎంపిక చేశారట.
Advertisement
ఇందులో రమ్యకృష్ణ మరియు రంభ హీరోయిన్స్ గా నటించారు.1994 ఆగస్టు 26 వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. దీనికి ఎన్టీఆర్ క్లాప్ కొట్టడానికి ప్రధాన కారణం దేవి వరప్రసాద్ కు మరియు ఎన్టీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఈ సినిమాకు క్లాప్ కొట్టడానికి అంగీకరించాడు. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పవచ్చు.
also read:టీమిండియా క్రికెటర్లకు కాసుల పంట… కోహ్లీ నుంచి షమీ వరకు ఎవరికి ఎంత జీతామో తెలుసా ?