Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరమే లేదు. ఆయన ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యాడు. ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ కూడా స్థాపించాడు.కానీ రాజకీయాల్లో రాణించలేనని గ్రహించి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు చిరంజీవి. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకి వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
Advertisement
Advertisement
చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్ ఢిల్లీలో జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో ఆర్థోస్కోపి KNEE WASH ట్రీట్మెంట్ తీసుకున్నారు చిరంజీవి. ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే దాదాపు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. రెస్ట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ కి రానున్నారు. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు. పుట్టిన రోజునే చిరంజీవి తన నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నారు.
ఇక ఈ సినిమాకి నిర్మాత చిరంజీవి కూతురు సుస్మిత వ్యవహరించనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవికి మోకాలి శస్త్ర చికిత్స కావడంతో సినిమా కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ వాటికి చెక్ పెడుతూ మోకాలీ ట్రీట్ మెంట్ తరువాత చిరంజీవి మరో ప్రాజెక్ట్ చేయనున్నాడని స్పష్టమవుతోంది.
Also Read :
భోళా శంకర్ సినిమాని చూసి.. ఫ్యాన్ లేఖ..!
చిరంజీవి భోళా శంకర్ మూవీని.. ముందు రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో.. ఎవరు అంటే..?