Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ఏ రేంజ్ లో గుర్తింపు సాధిస్తారో దానికి కాస్త తక్కువ రేంజ్ లో విలన్లు కూడా గుర్తింపు సాధిస్తారు. కానీ హీరో హీరో లాగా గుర్తించబడితే, విలన్ కాస్త నెగిటివ్ థాట్ తో గుర్తించబడతాడు. అలా తెలుగు, తమిళ్ సినిమా ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు సాధించారు పొన్నంబలం. ఈయన పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టారు కానీ ఫోటో కనబడితే అందరు గుర్తుపట్టేస్తారు. ఈయన గతంలో కూడా ఎన్నో చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
Advertisement
also read: నాటు నాటు పాటకు కాలు కదిపిన మాజీ క్రికెట్ లెజెండ్స్..!!
Advertisement
ఈయనది తమిళనాడు అయినప్పటికీ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి బాగానే డబ్బు సంపాదించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన తనకు జరిగిన సంఘటన చెప్పుకొచ్చారు. మా నాన్నకి నలుగురు భార్యలు. ఇందులో మూడో భార్య కొడుకు నా మేనేజర్ గా ఉండేవాడు. అయితే నా తమ్ముడికి ఏ పని లేదని నేనే నా దగ్గర డబ్బులు ఇచ్చి మరి పనికి పెట్టుకున్నాను. కానీ నా తమ్ముడు మాత్రం నా స్టార్ డంని ఓర్వలేక నేను తినే ఆహారంలో స్లో పాయిజన్ పెట్టి నన్ను చంపాలని చూశారు.
also read:
ఇక స్లో పాయిజన్ వల్ల నా రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఆ సమయంలో నాకు మెగాస్టార్ చిరంజీవి 45 లక్షలు ఇచ్చి కాపాడారు. అయితే చాలామంది నేను బాగా తాగడం వల్ల కిడ్నీలు పాడయ్యాయని అనుకున్నారు. కానీ నా సొంత తమ్ముడు స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల నా కిడ్నీ లు పాడయ్యాయని డాక్టర్లు చెప్పడంతో నేను షాక్ అయిపోయాను. ప్రస్తుతం పొన్నం బలం తమిళంలో అడపాదప సినిమాల్లో నటిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
also read: