Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరుని పొందారు చిరు. అలానే వైవా హర్ష గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య సినిమాల్లో కూడా హర్ష బాగా కనపడుతున్నాడు. యూట్యూబ్లో కూడా ఫేమస్ అయ్యాడు. తనదైన మేనరిజంతో అందరిని ఆకట్టుకుంటూ నవ్విస్తూ ఉంటాడు వైవా హర్ష.
Advertisement
Advertisement
హర్ష కి, చిరంజీవికి ఉన్న సంబంధం ఏంటంటే, చిరంజీవి స్నేహితుడు కొడుకే హర్ష. ఈ విషయం చాలామందికి తెలియదు. చిరంజీవి మొన్న వైవా హర్ష గురించి మాట్లాడటం జరిగింది తన క్లాస్మేట్స్ అందరూ కూడా ఈ మధ్య కలిశారట అక్కడే చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ అప్పుడు తన స్నేహితుడు కొడుకు వైవా హర్ష అని తనకి తెలియదని చిరు అన్నారు. కానీ మామూలుగా వైవా హర్ష అంటే తెలుసట. కేవలం నటుడుగా మాత్రమే తెలుసు కానీ స్నేహితుడు కొడుకు అని తెలియదని చిరంజీవి అన్నారు. ఈ విషయం విన్న తర్వాత తనకి చాలా సంతోషం కలిగిందని చిరు చెప్పారు.
Also read: