Advertisement
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమా హిట్స్ సాధించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయారు.. 1997లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా సూపర్ హిట్, తర్వాత వచ్చిన పెళ్లి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో నవీన్ కు అనేక ఆఫర్లు వచ్చాయి.. మరి అలాంటి వడ్డే నవీన్ ఇండస్ట్రీలోకి రావడానికి ఆదర్శం ఎవరో కాదు, ఆయన తండ్రి రమేష్.. ఆయన ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాత కావడం దీంతో నవీన్ కు సినిమాలపై ఆసక్తి పెరగడంతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు..
అలా వచ్చిన కొద్ది సమయంలోనే పేరు సంపాదించుకున్న నవీన్ అంతే స్పీడుగా తెరమరుగయ్యారు.. ఇదంతా పక్కన పెడితే నవీన్ తన నిజజీవితంలో నందమూరి కుటుంబానికి అల్లుడు అనే సంగతి చాలా మందికి తెలియదు.. ఎన్టీ రామారావు కొడుకుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ కుమార్తెను వడ్డే నవీన్ వివాహమాడారు.. అయితే ఈ సంబంధానికి ప్రత్యేక కారణం ఎన్టీఆరేనట. ఎన్టీఆర్ మరియు వడ్డే నవీన్ మంచి స్నేహితులు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి..
Advertisement
also read:Brahmastra Review : ‘బ్రహ్మాస్త్ర’ రివ్యూBrahmastra Review : ‘బ్రహ్మాస్త్ర’ రివ్యూ
అయితే పెళ్లికి ముందే నవీన్ ఆమెతో లవ్ లో ఉన్నారని, ఆ తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ సంబంధం కుదిరింది అని వార్తలు కూడా వినిపించాయి. ఇలా మొత్తానికి సంబంధం కుదిరి నందమూరి కుటుంబానికి అల్లుడయ్యారు నవీన్.. దీంతో ఎన్టీఆర్ కు బావ అయిపోయారు.. అలా కొద్ది రోజులు వారి సంసారం బాగానే సాగింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన భార్యకు విడాకులు ఇచ్చారు.. తర్వాత వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అలా వివాహం చేసుకున్న కానీ నందమూరి ఫ్యామిలీ హీరోలతో నవీన్ స్నేహంగానే ఉంటారట.
Advertisement
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 09.09.2022