Advertisement
Dulquer Salmaan’s Chup Telugu Dubbed Movie OTT Release Date : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘చుప్’ ఓటిటి లోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు. విలక్షణ కథాంశాలతో దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో హీరోగా చక్కటి విజయాన్ని అందుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. అతడు హీరోగా నటించిన హిందీ సినిమా చుప్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీరియల్ కిల్లర్ కథతో డైరెక్టర్ ఆర్ బాల్కి చుప్ సినిమాను తెరకెక్కించాడు.
Advertisement
Dulquer Salmaan’s Chup Telugu Dubbed Movie OTT Release Date
సినిమా రివ్యూవర్స్ ను మాత్రమే చంపే ఓ సీరియల్ కిల్లర్ ను అరవింద్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు. ఈ హత్యలతో డాని, నీలా మీనన్ అనే జంటతో ఉన్న సంబంధం ఏమిటి అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. జర్నలిస్టుగా దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించాడు. సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. ఈనెల 25 నుంచి జి5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దాదాపు 20 కోట్లకు జీ5 ఓటిటి సొంతం చేసుకున్నట్లు సమాచారం. చుప్ సినిమాలో శ్రేయస్ ధన్వంతరి హీరోయిన్ గా నటించింది. కర్వాన్, జోయ ఫాక్టర్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన బాలీవుడ్ సినిమా ఇది. ఇటీవల సీతారామం సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇది ఇలా ఉండగా, చుప్, ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాలా సినిమాలతో పోలిస్తే బెటర్. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఇరగదీసాడు. ఆర్ బాల్కి ఐడియాస్, నరేషన్, ఇతర ఆర్టిస్టులను ఆయన డామినేట్ చేశారు. దుల్కర్ కోసం ఒక్కసారి చూడాల్సిన సినిమా ‘చుప్’.
READ ALSO : Kantara OTT Release date : ఎట్టకేలకు ఓటీటీలో ‘కాంతార’..స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా ?