Advertisement
ఏదైనా సాధించాలన్న తపన ఉంటే కచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. సక్సెస్ వస్తుంది కదా అని కష్టపడకుండా కూర్చుంటే ఏ రోజుకి కూడా సక్సెస్ ని అందుకోలేము. ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఇటువంటివి కూడా సక్సెస్ కి అడ్డంకి అవ్వవు. కొంతమంది వివిధ కారణాల వలన లక్ష్యం వైపు అడుగులు వెయ్యరు. కొంతమంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. కానీ నిజానికి దాని మీద ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేశారంటే ఏదో ఒక రోజు మీరు సక్సెస్ ని అందుకుంటుంటారు. ఉదయ్ కృష్ణారెడ్డి గురించి చూశారంటే కచ్చితంగా అతన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో చదివి సివిల్స్ లో ర్యాంక్ సాధించారు.
Advertisement
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలకి ఉండే పోటీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎంత గట్టి పోటీ ఉంటుందో మనందరికీ తెలుసు. సివిల్స్ సాధిస్తే దేశానికి సేవ కూడా చేయచ్చని చాలామంది భావిస్తారు మొదటి ప్రయత్నంలో చాలామంది విఫలమవుతారు కానీ పట్టిన పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు సక్సెస్ ని అందుకోవచ్చు. చాలామంది సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు.
Advertisement
Also read:
Also read:
ఏపీకి చెందిన ఒక యువకుడు అంకితభావంతో చదివి సివిల్స్ పరీక్షలో సత్తా చాటాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 786 వ ర్యాంక్ సాధించారు చాలామంది లక్షలు పోసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికే విఫలమవుతూ ఉంటారు. కృష్ణారెడ్డి నానమ్మ కూరగాయలు అమ్ముతూ ఇతన్ని చదివించింది నానమ్మ త్యాగం కష్టాన్ని స్మరించుకుంటూ ఉదయ్ కృష్ణారెడ్డి 786 వ ర్యాంకును సాధించారు దానికంటే ముందు కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సాధించాడు. 2019 సిఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేశారు సివిల్స్ వైపు దృష్టి పెట్టారు ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!