Advertisement
ఎన్నికల నేపథ్యంలో వ్యూహ రచనలో బిజీ గా ఉన్న సీఎం జగన్ మరోసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.
Advertisement
అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకోవడానికి అప్పుడప్పుడు దత్త పుత్రుడు వస్తుంటాడని ఎద్దేవా చేసారు. దత్త పుత్త్రుడి ఇంట్లో ఇల్లాలు మూడు నాలుగు ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటుంది అంటూ కామెంట్స్ చేసారు. దత్త పుత్రుడు వంటి వ్యక్తిపై ప్రజలకు ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
దత్తపుత్రుడు అంటూ జగన్ మరోసారి పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటుందని.. ఇంట్లో ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు ఓ సారి మారుతూ ఉంటుందని ఆయన కామెంట్స్ చేసారు.
ఓ సారి లోకల్, మరోసారి నేషనల్ అయితే.. ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ కామెంట్ చేసారు. ఏపీలో దోచుకుని, తెలంగాణాలో పంచడం ఆయనకీ అలవాటు అయిపోయిందని అన్నారు.
Advertisement
చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు ఎప్పుడూ ఏపీలో కనిపించరని అన్నారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఓ నెల రోజులు ఏపీలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వారికి ఏమీ చెయ్యలేదని అన్నారు. ఇప్పుడు కేసు నమోదు అవ్వడం వల్లే రాజమండ్రి జైలులో ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..
ఈ దత్త పుత్రుడు షూటింగ్స్ మధ్య ఉండే గ్యాప్ లో వచ్చే వ్యాపారి అంటూ కామెంట్ చేసారు. ఈయనకు వివాహ వ్యవస్థపైనే గౌరవం లేదని.. వాడుకోవడం, వదిలేయడం లాగానే నియోజక వర్గాలను కూడా భావిస్తారని చెప్పుకొచ్చారు.
ఈ వ్యక్తులకు మన మట్టి, మనుషులతో అనుబంధాలు లేవని అన్నారు. లక్షల విలువైన ఆస్తులను అక్క చెల్లెళ్ళ చేతుల్లో పెడుతున్నామని.. మా వల్ల ఏదైనా మంచి జరిగిందని అనిపిస్తే.. మాకు తోడు ఉండాలని కోరుకుంటున్నాం అని జగన్ పేర్కొన్నారు.
మరిన్ని..
BJP Leader Ravi Kumar Yadav: తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!
Bathukamma 2023: Wishes, Festival Dates, Celebrations, Images, Songs, Pooja
మరో సీతారామం జంట..! ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుని.. యుద్ధం వచ్చేసరికి..?