Advertisement
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులు వామపక్ష ఉగ్రవాదం పై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సదస్సుకి వెళ్లారు. జగన్ రాత్రి మంత్రి అమిత్ షా ని కలిశారు. శనివారంతో అంటే ఈరోజు తో ఈ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం తాడేపల్లికి వచ్చేస్తారు. ప్రధాన నరేంద్ర మోడీకి వైయస్ జగన్ లేఖ రాశారు, కృష్ణాజలాల అంశాన్ని తన లేఖ లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
Advertisement
కృష్ణా జలాల పంపకాల విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన పడుతున్నట్లు చెప్పారు. అలానే తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలని కూడా కోరారు. వైయస్ జగన్ ఆరు అంశాలని ప్రస్తావనికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలో పొందపరచిన హామీలను అమలు చేయడం, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ని ఏర్పాటు పై క్యాబినెట్ నిర్ణయం గురించి, పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల వంటివి ఉన్నాయి.
Advertisement
ఏపీ తెలంగాణకి మాత్రమే కొత్త ట్రిబ్యునల్ విధివిధానాలని పరిమితి చేయడం అలానే మహారాష్ట్ర కర్ణాటకలోని మినహాయించాలని సూచించడం అశాస్త్రీయమని జగన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఇంకా వేగంగా చేయాలని, పెండింగ్ నిధులను విడుదల చేయాలని జగన్ కోరారు.
Also read: