Advertisement
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ నేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత నుంచి తన ప్రణాళికలను అమలు పరచడం మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఆయన విశాఖ కేంద్రంగా తన పనులను ప్రారంభించనున్నారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయనున్నారు. వై ఎపి నీడ్స్ జగన్ అనే కార్యక్రమం ద్వారా జగనన్న సంక్షేమ పధకాల గురించి ఇంటింటికి ప్రచారం చెయ్యనున్నారు. ఈ నెల 11 వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ పార్టీ శ్రేణులు వెళ్లేలా చేయనున్నారు.
Advertisement
అలాగే ప్రస్తుతం అమలు అవుతున్న అభివృద్ధి పధకాల విషయంలో కూడా వేగం పెంచనున్నారు. ఎవరికన్నా అర్హత ఉండి కూడా పధకాల లబ్ది అందకపోతుంటే.. వారికి అందేలా చేయనున్నారు. సంక్షేమ ఓట్ బ్యాంకు ను మరింత పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో ఈ నెల 16 వ తేదీన ఇన్ఫోసిస్ ముఖ్య కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. దసరా నుంచి వారంలో రెండు రోజుల పాటు జగన్ విశాఖ నుంచే పాలన చేయనున్నారు.
Advertisement
ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా రుషికొండలో ఆరు బ్లాకులను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటక శాఖ ఈ ఏర్పాట్లను చేస్తోంది. వీటిల్లో కళింగ బ్లాక్ కు సంబంధించి సి ఎం జగన్ భూమి పూజ చెయ్యనున్నారు. మొత్తం ఆరు బ్లాకులలో ముందుగా రెండు బ్లాకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. విశాఖ నుంచే సి ఎం జగన్ ప్రతిపక్షాలకు కౌంటర్లు విసిరే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ నుంచి పాలన ద్వారా ఉత్తరాంధ్రలో పట్టు సాధించడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని..
జైలర్ మూవీలో ఈ సీన్ గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు బోయపాటి గారు..? దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్..!
తెలుగింటి సంస్కృతి అన్న మ్యూజిక్ వీడియో కి 1 M వ్యూస్ ఘనంగా విజయోత్సవ వేడుకలు