Advertisement
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారపర్వం చివరి దశకు చేరుకుంది. నవంబర్ 1 సాయంత్రం 6 టలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో చివరి మూడు రోజులు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. కాకపోతే చివరి నిమిషంలో బీజేపీ సభను రద్దు చేసుకుంది. 30న టీఆర్ఎస్ సభ, 1న కాంగ్రెస్ మహిళా గర్జన యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే.. టీఆర్ఎస్ సభకు కేసీఆర్ హాజరవుతుండడం.. ఆయన ఏం మాట్లాడనున్నారనే ఉత్కంఠ అందరిలో ఉంది.
Advertisement
కొద్ది రోజులుగా మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారం చుట్టే తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఈ ఇష్యూపై టీఆర్ఎస్ మొదట్లో కాస్త హడావుడి చేసినా.. కేటీఆర్ సైలెంట్ గా ఉండమని చెప్పడంతో అంతా గప్ చుప్ అయిపోయారు. అయితే.. సీఎం కేసీఆర్ కూడా మౌనంగా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విషయం బయటకు వచ్చాక.. వెంటనే ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు కేసీఆర్. తర్వాతి రోజు వారితో కలిసి ప్రెస్ మీట్ పెడతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఏది జరగలేదు.
Advertisement
ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు వెళ్తున్నారు కేసీఆర్. చండూరులో ఆదివారం ముఖ్యమంత్రి సభ జరగనుంది. మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ ని అస్త్రంగా చేసుకుని కేసీఆర్ కేంద్రంపై అక్కడే విరుచుకుపడతారని చర్చ సాగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను చండూరు సభకు సీఎం తీసుకువెళ్తారట. సభా వేదిక నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసీఆర్ స్పందిస్తారని అంటున్నారు. ఈ క్రమంలో సీఎం ఏం మాట్లాడతారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇటు కేసీఆర్ సభకు పోటీగా బీజేపీ ఏర్పాటు చేసిన నడ్డా సభ రద్దయింది. సభ కన్నా.. ఇంటింటి ప్రచారమే బెస్ట్ అని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు చండూరులో నవంబర్ 1న మహిళా గర్జన సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. తమ అభ్యర్థి మహిళ కావడం వల్ల ఓట్లు రాబట్టేందుకు ఈ సభ మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.