Advertisement
కమెడియన్ గా, విలన్ గా నటిస్తూ సుబ్బరాజు మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదు పదులు వయసుకి చేరువు అవుతున్న తరుణంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. తాజాగా ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుబ్బరాజు తన భార్యతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేశారు. ఆమె ఎవరు..? ఏంటి..? అనే దాని గురించి ఎక్కడ చెప్పలేదు. సుబ్బరాజు పెళ్లి చేసుకున్న ఆమె ఎవరని అంతా ఆరా తీస్తున్నారు.
Advertisement
ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తా లేదంటే మరి ఎవరైనా అని అడుగుతున్నారు. సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబందించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పేరు స్రవంతి. ఆమె ఒక డాక్టర్. అమెరికాలో ఫ్లోరిడాలో ఈమె డెంటిస్ట్ గా పని చేస్తున్నారు.
Advertisement
Also read:
వీళ్ళ వివాహం యూఎస్ లో సింపుల్ గా జరిగింది. అతి త్వరలోనే హైదరాబాద్లో ఒక సినీ సెలబ్రిటీల సమక్షంలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతో మంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. సుబ్బరాజు ఖడ్గం మూవీ టైంలో కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా చేరి తర్వాత విధంగా కొన్ని పాత్రలు చేశారు ఆ తర్వాత కమెడియన్ గా కూడా అందరిని నవ్వించారు.