Advertisement
Committee kurrollu Review: తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇచ్చి కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు. నాగబాబు కూతురు నిహారిక ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. యదవంశీ గోదావరి జిల్లాలో ఉండే కొంతమంది కుర్రాళ్ళ కథని సినిమాగా మార్చారు. ఈ సినిమా ఎలా ఉంది..? రివ్యూ, రేటింగ్ వంటి వివరాలని చూద్దాం.
Advertisement
సినిమా: కమిటీ కుర్రోళ్లు
దర్శకత్వం: యదు వంశీ
నిర్మాత:కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
నటులు: సాయి కుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు తదితరులు
సంగీతం: అనుదీప్ దేవ్
రిలీజ్ డేట్: 09-08-2024
కథ:
కథ విషయానికి వస్తే.. గోదావరి జిల్లాలో ఒక ఊర్లో 12 సంవత్సరాలకు ఓ సారి జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఊరు మొత్తం పాల్గొని విజయవంతంగా చేయాలని చూస్తుంది. జాతర తర్వాత ఎలక్షన్లు ఉంటాయి. ఈ ఎన్నికల వలన గత సంవత్సరం ఓ వ్యక్తి మరణిస్తాడు. ఇప్పుడు కూడా మళ్లీ గొడవలు జరగచ్చని ఊరు పెద్దలు జాతరకి ఎలక్షన్స్ కి మధ్య కొంచెం దూరం ఉండాలని ఉద్దేశంతో జాతర అయ్యేంతవరకు ఎలక్షన్ల గురించి ఎవరు మాట్లాడకూడదని.. ప్రచారాలు కూడా చేయకూడదని తీర్పు ఇస్తారు. ఈ కమిటీ కుర్రాళ్ళు ఏం చేశారు..? గత ఎన్నికల్లో వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి..? ఎలక్షన్స్ ఎలా జరిగాయి..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. 2023 నాటి రోజులను రీ క్రియేట్ చేసి చూపించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా అన్ని క్యారెక్టర్లలో ఒక ఇంటెన్స్ డ్రామాని తీసుకువచ్చారు. మెలోడ్రామని పండించడంలో కూడా సక్సెస్ ని సాధించారని చెప్పొచ్చు.
Advertisement
ఇందులో కొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి. 2003, 2004 సంవత్సరాల్లో ఉన్న యూత్ ఎలాంటి మెంటాలిటీ తో ఉన్నారు అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా సెన్సిబుల్ గా ఉంది కొన్ని సీన్లు ప్రేక్షకుల హృదయాలను పిండేస్తాయి. రిజర్వేషన్లు కులాలకు సంబంధించిన విషయాలని కూడా చూపించారు. ఎక్కడా కూడా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక నటుల విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరు కూడా పాత్రకి తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. నిజానికి నటించారు అనే దాని కంటే జీవించారని చెప్పొచ్చు. టెక్నికల్ అంశాల విషయానికి వచ్చేస్తే.. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని మెలోడీ డ్రామా సీన్స్ అయితే అదిరిపోయాయి. మొదటి నుంచి కూడా గ్రిప్పింగ్ సీన్స్ ప్లే చేస్తూ దానికి తగ్గట్టుగా ఎడిటర్ చాలా కష్టపడ్డాడు. నెక్స్ట్ లెవెల్ లో తన పని చేశాడు.
Also read:
ప్లస్ పాయింట్స్:
కథ
ఎమోషన్స్
ఆర్టిస్ట్స్ నటన
మైనస్ పాయింట్స్:
కొంచెం స్లోగా స్టార్ట్ అవడం
కొన్ని క్యారెక్టర్లను తక్కువగా వాడుకోవడం
రేటింగ్: 2.75/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!