Advertisement
గత పదేళ్లుగా అధికారంలో కొనసాగిన బిఆర్ఎస్ పార్టీకి తిక్క లేపేలా షాకులు ఇవ్వడంలో తెలంగాణ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. బిఆర్ఎస్ పార్టీనుంచి పలుకుబడి, జనల నాడి కలిగిన పెద్ద నేతలతో సహా పలువురిని కాంగ్రెస్ పార్టీ వైపుకు తీసుకెళ్ళిపోతోంది. పలుకుబడి కలిగిన నేతలంతా గులాబీ పార్టీని వీడుతుండడంతో బిఆర్ఎస్ అధిష్టానంలో కలవరం మొదలైంది. మరో వైపు బిఆర్ఎస్ లో ఉన్న ఇతర నేతల్లో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించడంలో తాము సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ భావిస్తోంది.
Advertisement
వీటిని కూడా చదవండి: విడాకులు తీసుకుంటున్న కూతురిని తండ్రి పుట్టింటికి ఎలా తీసుకొచ్చారో తెలిస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేరు !
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు గులాబీని వదిలి హస్తం గూటికి చేరుతున్నారు. పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలను కూడా కాంగ్రెస్ తన గూటిలోకే చేర్చుకుని బలం పెంచుకుంటోంది. ఇప్పటికే బలమైన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పై విజయం సాధించాలని కసిగా ఎదురు చూస్తోంది. గతంలో బిఆర్ఎస్ అంటే దాదాపు అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ. పార్టీకి కంచుకోటలా కార్యకర్తలే ఉంటారని.. వారికి కూడా బీమాని అందించే ఏకైక పార్టీ అని చాలానే చెప్పుకునే వారు బిఆర్ఎస్ గురించి. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Advertisement
వీటిని కూడా చదవండి: ఇంగ్లాండ్ పై ఆఫ్ఘన్ గెలుపుకి BCCI చేసిన పరోక్ష సహాయం ఇదేనా ?
పోలింగ్ సమయానికల్లా బిఆర్ఎస్ కు ఊపిరి సలపకుండా చుట్టూ ముట్టే విధంగా కాంగ్రెస్ పక్కా లెక్కలతో ఉంది అంటూ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ తీరుతో బిఆర్ఎస్ నేతలకు రోజుకో షాక్ తగులుతోంది. మరోవైపు పార్టీలోని చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. సంక్షేమ పధకాల అమలులో చిక్కులు ఎదురవ్వడం, బిఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడం, ఎమ్మెల్యేలు గా ఉంటున్న కనీస సౌకర్యాలు కల్పించకపోవడం.. వంటి చాలా కారణాల వలన బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపుకే వెళ్ళడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని..
ప్రవల్లిక కేసులో అసలు జరిగింది ఇదే.. సంచలన విషయాలు బయట పెట్టిన తల్లి, తమ్ముడు!