Ads
కండ్ల కలకలతో చాలామంది బాధపడుతున్నారు. కండ్ల కలకలు వస్తే తేలికగా తీసి పారేయద్దు. భారీ వర్షాల వలన కండ్ల కలకల కేసులు భారీగా పెరుగుతున్నాయి. కళ్ళు ఎర్రబడి నీళ్లు కారడం, కళ్ళు వాయడం, మంట పుట్టడం, దురద కలగడం ఇటువంటివి కలుగుతున్నాయి. వానలతో తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలకల కేసులు ఎక్కువగా ఉంటున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. జూలై 1వ తేదీకి ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదైనట్లు డాక్టర్లు చెప్పారు. కండ్ల కలకల లక్షణాలు గురించి, కండ్ల కలకల వస్తే ఏం చేయాలి..? ఎందుకు వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లక్షణాలు:
- కన్ను ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిపోతుంది.
- లైట్ల వెలుగు ని చూడలేరు.
- జ్వరం, గొంతు నొప్పి ఉంటుంది.
- కంటి నుండి నీరు కారుతుంది.
- దురద వాపు వంటివి కనపడతాయి.
కండ్లకలక వస్తే ఏం చేయాలి..?
Advertisement
- డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది.
- కళ్ళని రుద్దకండి.
- ఉపశమనం లభించడానికి ఐ డ్రాప్స్ వేసుకోండి.
- కాంటాక్ట్ లెన్స్ ని పెట్టుకోవచ్చు.
- టవల్ తో కంటి స్రావాన్ని సున్నితంగా శుభ్రపరచుకోవాలి.
- యాంటీబయటిక్స్, స్టెరాయిడ్స్ ని తీసుకోవద్దు.
అసలు ఎందుకు ఇది వస్తుంది..?
- వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిల పీడనం ఎలర్జీలు కారణంగా ఇది వస్తుంది.
- ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుండి దూరంగా ఉండాలి. ఇతరులకి కూడా ఇది వ్యాపించవచ్చు.
- చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. వ్యాధి సోకిన వ్యక్తి తన చేతులతో కళ్ళని తాకకూడదు.
- వ్యాధి సోకిన వ్యక్తి టవల్స్ వంటి వాటిని ఇతరులు ఉపయోగించకూడదు.
Also read:
- చాణక్య నీతి: ఈ లక్షణాలు మీ భార్య లో ఉంటే.. జాగ్రత్త..!
- ‘బ్రో’ మూవీ లో ఈ మిస్టేక్స్ ని మీరు గమనించారా..?
- రావణుడు చనిపోయే ముందు రాముడితో.. ఏం చెప్పాడో తెలుసా..?