Advertisement
ప్రేమకు వయస్సుతో తారతమ్యం లేదు. ఏ వయస్సు వారికి అయినా ప్రేమ ఉంటుందనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు. కానీ వారి ప్రేమ మధ్యలోనే మటుమాయం కావడంతో రెండు కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. ఆమె వయస్సు 45, అతని వయస్సు 25. కేవలం ఒక్క మిస్డ్ కాల్ వారి మధ్య పరిచయానికి దారి తీసింది. ఆ పరిచయమే వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వీరిద్దరి బంధం వివాహేతర సంబంధానికి దారి తీసి చివరికీ ఆమె ఆ** చేసుకునేలా చేసింది. వారు చేసింది తప్పు అని తెలుసుకునే సమయానికి ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరొకరూ భయంతో ప్రాణాలు కోల్పోయారు. హయత్ నగర్ లో మృతి చెందిన రాజేష్ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. ములుగు జిల్లాకు చెందిన రాజేష్ రెండేళ్ల కిందట ఇబ్రాహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. అతనికి 7 నెలల కిందట సుజాత అనే టీచర్ ఆసక్తికరంగా పరిచయం అయింది. సుజాత రాంగ్ కాల్ చేయడంతో రాజేష్ పరిచయం అయ్యాడు. ఆ తరువాత వీరిద్దరూ తరుచూ ఎస్.ఎం.ఎస్ పంపించుకోవడం, ఫోన్ మాట్లాడుతుండేవారు. సుజాత డీపీని చూసి రాజేష్ ఆమెకు పెళ్లి కాలేదని భావించాడు. కానీ సుజాతకి పెళ్లి జరిగి ఇద్దరూ పిల్లలు. సుజాత నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన మోడల్ స్కూల్ లో ఇంగ్లీషు టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తనను సుజాత మోసం చేసిందని తెలుసుకున్నాడు రాజేష్. గత కొద్ది రోజుల పాటు సుజాతకి దూరంగా ఉన్నాడు. టీచర్ సుజాత దేవరకొండలో రూమ్ లో ఒంటరిగా ఉంటోంది.
Advertisement
ప్రభుత్వ సెలవులు ఉన్న సమయంలో సుజాత దేవరకొండ నుంచి హైదరాబాద్ కి వచ్చేది. పాఠశాల ఉన్న సమయంలో దేవరకొండ రూమ్ లో ఉంటూ.. నేరేడుగొమ్ము పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో సమయం దొరికినప్పుడల్లా ఒంటరిగా ఉన్న సుజాత రూమ్ కి వెళ్లేవాడు రాజేష్. ఇటీవల వేసవి కాలం సెలవులు కావడం.. సుజాతకి పెళ్లి జరిగిందని రాజేష్ కి తెలియడంతో కాస్త దూరంగా ఉన్నాడు రాజేష్. అయితే నన్ను కలవకపోతే చచ్చిపోతానని సుజాత వాట్సాప్ లో చెప్పింది. ఈ విషయం సుజాత కూతురు కి తెలిసి షాక్ కి గురైంది. వెంటనే ఈ విషయాన్ని తన తమ్ముడితో చెప్పింది. తన విషయం పిల్లలకు తెలిసిందని.. తన పరువు పోతుందని భావించి సుజాత పురుగుల మందు తాగింది. ఈ విషయం రాజేష్ కి తెలియక పదే పదే సుజాత మొబైల్ కి ఫోన్ చేస్తుండటంతో తన కుటుంబ సభ్యులు ఫోన్ లిప్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే టీచర్ కుమారుడు రాజేష్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగ్గా.. ఇంటి వద్దనే అని సమాధానం చెప్పాడు రాజేష్. అయితే రాజేష్ అక్కడికి వెళ్లి అతన్ని కలిసి నీ వల్లే మా అమ్మ చావు బతుకుల మధ్య ఉందని ఆగ్రహంతో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ కూడా పురుగుల మందు తీసుకున్నట్టు భావిస్తున్నారు పోలీసులు.సుజాత నివాసానికి సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ కుళ్లిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తొలుత సుజాత భర్త నాగేశ్వరరావు రాజేష్ ని చంపినట్టు భావించారు. కానీ ఆ తరువాత సంచలన విషయాల వెలుగులోకి వచ్చాయి. ఒక్క మిస్డ్ కాల్ రెండు ప్రాణాలను బలితీసుకుందని వెల్లడి అయింది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
జబర్దస్త్ బ్యూటీ దీప్తి సునైనా గృహప్రవేశం.. ఫొటోస్ అదిరిపోలా..!!
సావిత్రికి చివరి రోజుల్లో ANR, NTR ఎందుకు సాయం చేయలేదు?
కొడుకు చనిపోయాక కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!