Advertisement
లంచం తీసుకునే ఎంపీలు ఎమ్మెల్యేలకు విచారణ నుండి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ఏంటి..? 1998 నాటి పీవీ నరసింహారావు కేసుకి దీనికి సంబంధం ఏంటి ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం… చట్టసభల్లో కావాల్సిన అంశం మీద మాట్లాడడానికి, ప్రశ్నలు వేయడానికి, ఓటు వేయడానికి ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడం పార్లమెంట్ ప్రత్యేక అధికారుల పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సభల్లో ప్రసంగించేందుకు ఓటు వేయడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే వాళ్ల మీద క్రిమినల్ కేసు నమోదు చేయచ్చని వాళ్ళకి ఎలాంటి రాజ్యాంగపరమైన రక్షణ ఉండదని తీర్పు ఇచ్చింది కోర్టు.
Advertisement
105, 194 ఆర్టికల్స్ ప్రజాప్రతినిధులకి భయం లేని వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించింది. లంచాలు, అవినీతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నాయని ధర్మాసనం చెప్పింది. 1998 నాటి పీవీ నరసింహారావు కేసుని చెప్తూ ఈ కేసులో ఇచ్చిన తీర్పు ఒక విరుద్ధమైన పరిస్థితిని సృష్టించింది. ప్రజా ప్రతినిధులు లంచం తీసుకుని ఓటు వేసిన వాళ్ళకి రక్షణ కల్పించిందని చెప్పారు. పార్లమెంట్ అసెంబ్లీలలో ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రసంగాలకి ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న క్రిమినల్ విచారణ నుండి వినహాయింపు కల్పిస్తూ 1998లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం త్రీ-2 మెజారిటీతో తీర్పు ఇచ్చిందని కోర్టు చెప్పింది.
Advertisement
నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 105 (2), 194 కి వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టు చెప్పింది. 1998 నాటి పీవీ లంచం కేసుల విచారణ నుండి ప్రజా ప్రతినిధులకు మినహాయింపులు తీర్పు ఇచ్చారు. 2019లో చూసినట్లయితే జస్టిస్ రంజన్ జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ కన్నా కేసును విచారించారు పీవీ నరసింహారావు కేసులోని తీర్పు ఇక్కడ కూడా వర్తిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూద్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పడింది ఓటు వేయడానికి సభల్లో ప్రసంగించడానికి ఎంపీలు ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చని కొట్టు స్పష్టంగా చెప్పింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!