Advertisement
సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు. వేణు స్వామి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారం రోజులు తర్వాత ఆయనపై చర్యలు తీసుకోవచ్చని తెలంగాణ మహిళా కమిషన్ ని ఆదేశించింది. జ్యోతిష్యుడు వేణు స్వామి నాగచైతన్య సమంతల పెళ్లి గురించి చెప్పినప్పటి నుంచి విపరీతమైన పాపులానికి తెచ్చుకున్నారు. టాలీవుడ్ ఏ కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫేమస్ అయిపోయారు. చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
Advertisement
ఎంగేజ్మెంట్ తర్వాత వివాదాస్పద రీతిలో జాతకం చెప్పారు. పెళ్లి అనంతరం వాళ్ళిద్దరూ ఎప్పుడు విడాకులు తీసుకుంటారు అనే విషయంపై వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. ఆయన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. వేణు స్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ముందు హాజరు కావాలని గతంలో వేణు స్వామిని ఆదేశించింది.
Advertisement
Also read:
Also read:
మహిళా కమిషన్ ఆదేశాలు మేరకు వేణు స్వామి హైకోర్టుని ఆశ్రయించారు. విచారణకు పిలిచే అధికారం కమిషన్ కి లేదని హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే ని ఎత్తివేస్తూ వేణు స్వామిని విచరించడానికి మహిళా కమిషన్ కి పూర్తి అధికారాలు ఉన్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా వేణు స్వామి పై చర్యలు తీసుకోవాలని కమిషన్ ని కోర్టు ఆదేశించింది. మరి ఏమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!