Advertisement
ఇవాళ్టి నుంచి ప్రపంచ కప్ 2022 లీగ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇక నిన్నటి వరకు సూపర్-12 క్వాలిఫై మ్యాచ్ లు జరిగాయి. ఈ సూపర్-12 క్వాలిఫై మ్యాచ్ లలో ఎన్నో అద్భుతాలే జరిగాయి. ఆర్థిక సంక్షోభాలతో అల్లాడుతున్న జింబాబ్వే కు ఆ దేశ క్రికెటర్లు కాసింత ఉపశమనం ఇచ్చారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో క్వాలిఫై రౌండ్ ఆడిన ఆ ఈ ఆఫ్రికన్ జట్టు, తొలిసారి ఈ మెగా టోర్నీ ఆడబోతున్నది.
Advertisement
శుక్రవారం ముగిసిన క్వాలిఫైయర్ రౌండ్ ఆఖరి మ్యాచ్ లో స్కాట్లాండ్ ను ఓడించిన జింబాబ్వే సూపర్-12కు అర్హత సాధించింది. ఫలితంగా ఆ జట్టు, ఐర్లాండ్ తర్వాత గ్రూపు-బి నుంచి సూపర్-12 కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా నిలిచింది. హోబర్ట్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్కాట్లాండ్, తోలుతా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు ఓపెనర్ మున్సే(54) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Advertisement
అయితే మున్సే కు సహకరించే ఆటగాళ్లు కరువడంతో స్కాట్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. వికెట్ కీపర్ క్రాస్, బెర్రింగ్టన్, నెక్ లాయిడ్, లిస్క్ లు విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య చేదనలో జింబాబ్వే కూడా తడబడింది. స్కోరుబోర్డుపై పది పరుగులు కూడా చేరకముందే ఓపెనర్ రెజిగ్ చకబవ, వెస్లీలు అవుట్ అయ్యారు. కానీ కెప్టెన్ క్రేయింగ్ ఎర్విన్, భారత సంతతి ఆటగాడు సికిందర్ రాజా అదుకోవడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో జింబా బ్వే గ్రూపు-బి నుంచి సూపర్-12 కు అర్హత సాధించింది. t20 ప్రపంచ కప్ ప్రారంభమయ్యాక ఆ జట్టు ఈ మెగా టోర్నీకి అర్హత సాధించి సూపర్-12 కు చేరడం ఇదే ప్రథమం. కాగా.. ఇండియా రేపు పాక్ తో తలపడనున్న సంగతి తెలిసిందే.
READ ALSO : ప్రమాదంలో టీమిండియా ఆల్ రౌండర్ కెరీర్