Advertisement
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో క్రికెట్ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది. దేశంలోనే అత్యున్నతమైన క్రీడలలో క్రికెట్ ఒకటి. ఇందులో ఆడే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంటారు. అలాంటి క్రికెట్ ఆటగాళ్లలో ఇండియన్ టీం తరఫున ఆడి ఎన్నో రికార్డులు సాధించిన కొంతమంది క్రికెటర్లు, ఒకప్పుడు గవర్నమెంటు సంస్థల్లో ఉద్యోగాలు చేశారు.. మరి వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం..
సచిన్ టెండూల్కర్ :
Advertisement
ఇండియాలో క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ తన కెరియర్ లో అనేక రికార్డులు సాధించాడు. ఎన్నో బిరుదులు అందుకున్నాడు. సచిన్ క్రికెట్ కు చేసినటువంటి సేవకు గుర్తుగా 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా నియామకం అయ్యారు.
మహేంద్రసింగ్ ధోని:
అంతర్జాతీయ క్రికెట్ లోకి రాకముందు మహేంద్ర సింగ్ ధోనీ ఖరాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశారు. తర్వాత క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదిగి,2011 ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ సాధించింది. అదే ఏడాది లెఫ్టినెంట్ కర్నల్ గా నియమితులయ్యారు.
జోగిందర్ శర్మ:
Advertisement
2007లో టీ20 కప్ ఫైనల్, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ వేసి ఇండియా టీం కు మరపురాని విజయాన్ని అందించారు. జోగీందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహించారు.
ఉమేష్ యాదవ్:
టీమిండియా పేసర్ గా ఉమేష్ యాదవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యారు.
కేఎల్ రాహుల్ :
2016 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కె.ఎల్.రాహుల్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యారు.
యుజ్వేంద్ర చాహల్ :
టీమిండియా మణికట్టు మాంత్రికుడిగా పేరుపొందిన యుజ్వేంద్ర చాహల్ 2016 లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. చాహల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఇన కమ్ టాక్స్ ఆఫీసర్ గా పోస్టు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆ ఉద్యోగాన్ని కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
ALSO READ:
IRCTC రిఫండ్ రూల్స్ : ఏసి పనిచేయకపోతే రిఫండ్ కోరవచ్చు.. ఎలానో తెలుసుకోండి ?