Advertisement
టెస్ట్ క్రికెట్ లో రికార్డుల మూత మోగించిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ట్రిపుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్లు మాత్రం తక్కువ మంది ఉన్నారు అలా ట్రిపుల్ సెంచరీలు చేసిన వాళ్ళ వివరాలను చూద్దాం.
Advertisement
డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా):
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ టెస్ట్ క్రికెట్‌లో ఏకంగా రెండు ట్రిపుల్ సెంచరీలు చేసారు. ఇంగ్లండ్‌పై ఈ రెండు ట్రిపుల్ సెంచరీలు చేసారు. 52 టెస్ట్ మ్యాచ్‌లలో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్ (భారత్):
ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసాడు. పాకిస్థాన్‌పై, దక్షిణాఫ్రికాపై ఈ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్ట్ మ్యాచ్‌లలో 49.34 సగటుతో 8586 పరుగులు స్కోర్ చేయడం జరిగింది.
క్రిస్ గేల్ (వెస్టిండీస్):
Advertisement
ప్రపంచ క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ కి గేల్ పెట్టింది పేరు. 103 టెస్ట్ మ్యాచ్‌లలో 42.18 సగటుతో 7214 పరుగులు స్కోర్ చేసాడు. ఫార్మాట్ ఏదైన సునామీ ఇన్నింగ్స్ తో గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై ఈ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు.
బ్రియాన్ లారా (వెస్టిండీస్)
ఈయన కూడా రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. ఈ రెండు ట్రిపుల్ సెంచరీలు ఇంగ్లండ్‌పైనే చేసారు. ఈ ఇన్నింగ్స్‌ల్లో అజేయంగా 400 రన్స్ చేసాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగు వందల పరుగుల వ్యక్తిగత ఇన్నింగ్స్ స్కోర్ చేసిన ఒకే ఒక్క ఆటగాడు లారా.
Also read:
కరుణ్ నాయర్ (భారతదేశం):
భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ కూడా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌పై కరుణ్ నాయర్ ఈ రికార్డు ని క్రియేట్ చేసాడు. కరుణ్ నాయర్ 6 టెస్టు మ్యాచ్‌ల్లో 62.33 సగటుతో 374 పరుగులు చేయడం జరిగింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!