Advertisement
జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రసిద్ధ మరియు గొప్ప భారతీయ క్రికెటర్లలో ఒకరు. తన ఫాస్ట్ బౌలింగ్ తో బుమ్రా ఇంటర్నేషనల్ గా పాపులర్ అయ్యారు. అంతే కాదు అతని వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అయితే.. ఇది ఆయనకు తన తల్లి దల్జీత్ బుమ్రా నుండి వచ్చిందని చెప్పవచ్చు. బుమ్రా తండ్రి మరణానంతరం, బుమ్రా తల్లి ఎన్నో త్యాగాలు చేసి అతనిని పెంచింది. బుమ్రా యొక్క వినయ స్వభావం అతని తల్లి త్యాగాలను చూసే వచ్చిందని చెప్పవచ్చు.
Advertisement
బుమ్రా తల్లి దల్జీత్ బుమ్రా జస్ప్రీత్ క్రికెట్ కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఈ ఆర్టికల్ లో వాటి గురించి తెలుసుకుందాం. బుమ్రా సిక్కు కుటుంబానికి చెందినవారు. మధ్య తరగతికి చెందిన జస్ప్రీత్ బుమ్రా నేడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బుమ్రా 5 సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు, అతని తండ్రి జస్బిర్ బుమ్రా మరణించారు. దానితో దల్జీత్ బుమ్రా కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. తల్లి సపోర్ట్ తోనే బుమ్రా 2016లో భారత క్రికెట్ జట్టులో బౌలర్‌గా చేరాడు మరియు ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచారు.
Advertisement
క్రికెట్ కెరీర్ ప్రారంభంలో ఖర్చుల కోసం బుమ్రా తల్లి దల్జీత్ ఇంటిని తనఖా పెట్టారు. పిల్లలకు ఓ మంచి వాతావరణాన్ని, కెరీర్ ను ఇవ్వడం కోసం బుమ్రా తల్లి చాలా ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే వారి చదువుకు కావాల్సిన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎమోషనల్గా వారికి సపోర్ట్ ఇవ్వడంలో కూడా దల్జీత్ బుమ్రా ముందున్నారు. బుమ్రాలోని క్రికెట్ పట్ల ఆసక్తిని దల్జీత్ ముందుగానే గుర్తించి ప్రోత్సాహం ఇచ్చారు. జస్ప్రీత్ అటువైపు అడుగులు వేసి విజయం సాధించడంలో తన తల్లి దల్జీత్ బుమ్రాది కీలక పాత్ర అని గతంలో కూడా చాలా సార్లు పేర్కొన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల ని ఇక్కడ మీరు చూడొచ్చు ! తెలుగు న్యూస్ కొరకు ఇటు చూడండి !