Advertisement
Das Ka Damki Movie Review in Telugu: “వెళ్ళిపోమాకే” సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తర్వాత “ఈ నగరానికి ఏమైంది” అనే సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక 2019లో “ఫలక్ నుమా దాస్” చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా మారారు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఈ సినిమా విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “దాస్ కా దమ్కి”. ఈ చిత్రం కూడా ఆయన స్వీయ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం.
Advertisement
ఈ చిత్రంలో నివేద పెతురాజ్ హీరోయిన్ గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రానికి లియాన్ జేమ్స్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రంలో రావు రమేష్, అజయ్, హైపర్ ఆది, మహేష్, దర్శకుడు తరుణ్ భాస్కర్, సీనియర్ నటి రోహిణి, పృధ్విరాజ్ తదితరులు నటించారు. వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు Das ka Damki Movie Review ఆకట్టుకుందో చూద్దాం..
Read also: ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసేది అందుకేనా ? కర్మ ఫలితం, సమయం విలువ ఏమిటంటే ?
Das ka Damki Movie Review, Storyin Telugu: కథ మరియు వివరణ:
ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు విశ్వక్ సేన్. సంజయ్ మరియు కృష్ణదాస్ అనే ఒకే రకంగా కనిపించే వేరు వేరు వ్యక్తుల పాత్రలలో నటించాడు. సంజయ్ ఎస్ఆర్ ఫార్మా కంపెనీకి ఓనర్. అతను క్యాన్సర్ ఫ్రీ ప్రపంచాన్ని చూడాలని ఓ డ్రగ్ ని కనిపెడతాడు. ఇక కృష్ణ దాస్ ఓ మిడిల్ క్లాస్ కి చెందినవాడు. అతను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఎలాగైనా రిచ్ గా బతకాలని అనుకుంటాడు కృష్ణదాస్. అయితే అనుకోని కారణాలవల్ల సంజయ్ చనిపోవడంతో కృష్ణ దాస్ అతని ప్లేస్ లోకి వెళ్తాడు. అయితే సంజయ్ ఎలా చనిపోయాడు? కృష్ణ దాస్ ఎలా మేనేజ్ చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
Advertisement
ఒక దర్శకునిగా ఈ సినిమాని రూపొందించడంలో విశ్వక్సేన్ కృషిని మనం అభినందించాలి. ఇలాంటి సినిమాని తెరకెక్కించడం సవాల్ తో కూడుకున్న విషయమనే చెప్పాలి. ఈ చిత్రంలో విశ్వక్సేన్ ద్విపాత్రాభినయం బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో విశ్వక్సేన్ తనలోని నటుడిని మరింతగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ లో పెద్దగా ట్విస్టులు లేవు కానీ.. సెకండ్ హాఫ్ లో వరుస ట్విస్టులు ఉన్నాయి. అయితే ఈ ట్విస్టులు గత సినిమాలలో చూసినట్లే అనిపిస్తాయి. నివేదా పెతురాజ్ అందాలు ఆరబోసిందనే చెప్పాలి.
ఇక సినిమాలోని లాజిక్ లేని సన్నివేశాలు కొన్ని ఇబ్బంది పెట్టాయి. ఫస్ట్ ఆఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండేదని అనిపించింది. సినిమాలోని కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హైపర్ ఆది, రంగస్థలం మహేష్ ఈ చిత్రంలో విశ్వక్సేన్ స్నేహితుల పాత్రలలో వారి కామెడీతో మెప్పించారు. ఇక మరోసారి తనదైన నటనతో మెప్పించారు రావు రమేష్. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఒక రొటీన్ చిత్రం అని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్:
ఫ్లాష్ బ్యాక్
ఊహించదగిన కథనం
ప్లస్ పాయింట్స్:
విశ్వక్ సేన్
ఇంటర్వెల్
నేపథ్య సంగీతం
రేటింగ్: 2.75/5
Read also: ఉగాది పండుగని జరుపుకోవటానికి వెనక కారణం ఏంటో తెలుసా ?