Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు అయింది. పవన్ పై పిటిషన్ వేశారు ఓ వాలంటీర్. ఇక ఈ వాలంటీర్ ఇచ్చిన పిటిషన్ ను విచారణకు స్వీకరించారు న్యాయమూర్తి. తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురై న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినట్టు పేర్కొంటున్నారు మహిళా వాలంటీర్. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు. పవన్ వ్యాఖ్యల పట్ల బాధితురాలు మనోవేదనకు గురయ్యారని.. కోర్టును ఆశ్రయించిన తరువాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన తరువాత పవన్ కళ్యాణ్ కి కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు.
Advertisement
Advertisement
ఈ కేసులో పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందంటున్నారు బాధితురాలి తరపు న్యాయవాదులు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వాలంటీర్లలో అధిక శాతం మహిళలున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ కి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ కి చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని అంటున్నారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సరికాదు. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని.. పవన్ వెనుక ఎవరు ఉన్నారో స్పష్టం చేయాలన్నారు. వదంతులతో ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేవిదంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరినట్టు వెల్లడించారు బాధిత వాలంటీర్ తరపు న్యాయవాదులు. ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.