Advertisement
ఇండస్ట్రీలో ఒక లెవల్ కి వెళ్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ సినీ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పవచ్చు.. అక్కడితో ఆగకుండా ఆయన మరణం వరకు వెళ్ళింది. ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. చిత్రం సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ మూవీ థియేటర్లో దాదాపుగా 100 రోజులకు పైగానే ఆడింది అని చెప్పవచ్చు.. ఈ మూవీ తర్వాత ఉదయ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా నువ్వు నేను..ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. దీంతో ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
Advertisement
అయితే ఉదయ్ కిరణ్ మరణించి 8 ఏళ్ల పైనే అవుతుంది. ఇప్పటివరకు అతని మరణం గురించి ఏదో ఒక అనుమానం ఎవరో ఒకరు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉదయ్ కిరణ్ చాలా సెన్సిటివ్ పర్సన్ అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనేకసార్లు నన్ను కలిసి తన బాధను చెప్పుకునే వాడు. ఉదయ్ కిరణ్ ఉరేసుకుని చనిపోయాడు. అయితే అంతకుముందు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దానికి సంబంధించిన విషయాలను కూడా నా దగ్గర చెప్పాడు.దీని వెనుక చాలా కథ ఉంది. అని డైరెక్టర్ తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే మరికొందరు అతను సినిమాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
అని మరికొన్ని వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా మస్కట్ లో సెటిల్ అయినా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాత్రం ‘తన తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయాడు అనేది అబద్ధం. నా తల్లి అతనికి నాలుగు కేజీల బంగారం, 100 కేజీల వెండిని ఇచ్చింది. అంతేకాదు అతని పేరు మీద ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఉదయ్ చనిపోయిన తర్వాత అతని భార్య విషిత వాటిని స్వాధీనం చేసుకుంది. అతను అప్పులు చేసి ఉంటే ఇచ్చినవాళ్లు ఎవ్వరూ ఇప్పటివరకు మమ్మల్ని సంప్రదించలేదు. మరి దాని సంగతి ఏంటి అంటూ ప్రశ్నించింది..ఇప్పటికీ విషితనే మేము కాంటాక్ట్ , అవ్వాలి అని ట్రై చేస్తుంటే ఆమె మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది’ అంటూ చెప్పి కొత్త అనుమానాలకు తెరలేపింది శ్రీదేవి.
also read:దిల్ రాజుతో పెళ్లంటే ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. ?