Advertisement
రాజకీయాల్లో ఉన్నవారు అందరి దేవుళ్లను ఫాలో అవుతారు. దానికి కారణం అన్ని వర్గాల ఓట్లను రాబట్టుకోవాలనే ఆశ. అందుకే గుడికెళ్తే పంచ కడతారు.. బొట్టు పెడతారు. ముస్లిం కార్యక్రమాల్లో టోపీ పెట్టుకుంటున్నారు. క్రైస్తవుల ప్రార్థనలకూ వెళ్తుంటారు. మతాలే కాదు.. కులాలవారీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు. ఇలా ఫాలో అయ్యేవారి మెయిన్ టార్గెట్ మాత్రం ఓట్లే. అయితే.. ఇదే ఫార్ములాని.. ఓ ప్రభుత్వ అధికారి ఫాలో అయితే..! ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీరు అలాగే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
మొన్న కరోనాను క్రీస్తు తరిమేశాడంటూ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. పైగా అభిృద్ధి అంతా ఆయన కృపేనని చెప్పిన కామెంట్స్ కొందర్ని బాగా హర్ట్ చేశాయి. దీంతో డీహెచ్ ను సస్పెండ్ చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందించి క్రీస్తు ఉండే దేశానికే వెళ్లిపోవాలని మండిపడ్డారు. డీహెచ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా సడెన్ గా ఆయన యాదాద్రిలో కనిపించారు. మెడలో పూల దండలతో మీడియా ముందుకొచ్చారు.
Advertisement
యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న శ్రీనివాసరావు.. కరోనా మహమ్మారి వ్యాపించకుండా చూడాలని కోరుకున్నానన్నారు. మొన్నేమో కరోనాను క్రీస్తు తరిమేశాడని చెప్పిన ఈయన.. ఇప్పుడు యాదాద్రీశుడిని కరోనా రాకూడదని పూజలు చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాలపై మోజుతోనే డీహెచ్ ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఓ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న డీహెచ్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది. అందులోభాగంగానే ఆమధ్య సీఎం కేసీఆర్ కాళ్లపై పడ్డారని అంటున్నారు. అందుకే అన్నివర్గాలను కవర్ చేసేందుకు ఆరోజును క్రీస్తును పొగిడి.. ఇప్పుడు యాదాద్రిలో పూజలు చేశారని చెబుతున్నారు.
ఇక కరోనా కరోనాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు డీహెచ్. కొత్త వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో కోవిడ్ పై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ వంద శాతం వేశామని తెలిపారు. ప్రస్తుతం వచ్చే వైరస్ ఫాస్ట్ గా ప్రజల్లోకి వెళ్తుందని, ప్రాణాంతకమైంది కాదని భావిస్తున్నామన్నారు డీహెచ్.