Advertisement
వైసీపీ అధినేత, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మూడు రాజధానుల ప్రతిపాదన సభ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు అమరావతి ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సభ ముందు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆమోదం పొందిన మండలిలో రభసకు కారణమైంది. ఆ తర్వాత మరోసారి సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. ఇక దీనిపైన అమరావతి వాసులు న్యాయపోరాటం చేశారు. ఈ నేపథ్యంలోనే, ఏపీలో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాల అంశం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు చేయడానికి అయినా సిద్ధమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జోరుగా చర్చ నడుస్తోంది. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసేందుకు ఉత్తరాంధ్రకు చెందిన వైసిపి నేతలు సిద్ధమయ్యారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇప్పటికే రాజీనామా చేయగా, ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, జగన్ సర్ది చెప్పారు. ఇది ఇలా ఉండగా మాజీ ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఉపముఖ్యమంత్రి నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో నిన్న జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినా, రాజీనామా చేస్తానని అన్నారు. జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని కృష్ణా దాస్ పేర్కొన్నారు. పొత్తు లేకుండా టిడిపి, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలని జగన్ చూస్తున్నారని అన్నారు. టిడిపి, జనసేన మాత్రం ఆ 25 గ్రామాల ప్రజల కోసం పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. టిడిపికి పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అంటే సినిమా కాదని, దానికి ఎంతో పరిణితి కావాలని పవన్ కు కృష్ణదాస్ సూచించారు.
READ ALSO : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి నేనే !