Advertisement
హామిల్టన్ వేదికగా భారత్ మరియు న్యూజిలాండ్ నవంబర్ 27వ తేదీన జరగాల్సిన రెండు వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా… 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ విఫలం కాగా, గిల్ , సూర్య కుమార్ యాదవ్ క్రేజ్ లో ఉన్నారు. 4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్ కు అంతరాయం కలిగించిన వర్షం… మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డు తగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం ఎంతకూ తగ్గపోవడంతో… మ్యాచ్ ను రద్దు చేస్తూ ఎంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు తూర్పు పై పెద్ద దుమారమే రేగింది. తొలి వన్డే లో పర్వాలేదనిపించిన సంజు శాంసన్ ను జట్టు నుంచి తప్పించడం అలాగే గత కొన్ని మ్యాచ్లుల్లో దారుణంగా విఫలమవుతున్న హర్షబ్ పంత్ నువ్వు జట్టులో కొనసాగించడం పై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్ మీడియా వేదికగా, కెప్టెన్ శిఖర్ ధావన్, కోచ్ లక్ష్మణ్ లను ఫాన్స్ ఎండగట్టారు.
Advertisement
అయితే ఈ విషయం వివాదాస్పదంగా మారడం అలాగే నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటం తో మ్యాచ్ రద్దయిన అనంతరం కెప్టెన్ ధావన్ దీనిపై స్పందించాడు. రెండో వన్డే లో శాంసన్ ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించారు. జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్థితుల్లో శాంసన్ కు బదులు దీపక్ హూడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్చి స్వింగ్ కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు ధావన్. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే సంజు ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని దీనిపై రాద్ధాంతరం అనవసరమని చురకలాంటించాడు ధావన్.
read also : పంత్ ఇకనైనా కొవ్వు తగ్గించుకో.. ధోనిని చూసి నేర్చుకో !