Advertisement
మహేంద్ర సింగ్ ధోని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని అసాధారణ ఆట తీరుతో ఇండియన్ క్రికెట్ ని మార్చేసాడు. తన కెప్టెన్సీలో ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించాడు ఈ మిస్టర్ కూల్. ఐపీఎల్ లో అయితే ఏకంగా చెన్నై ని ఐదు సార్లు విజేతగా నిలపాడు. నిజానికి ఈ స్థాయికి ధోని రావడానికి ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చింది.
Advertisement
జార్ఞండ్ రాష్ట్ర రాజధాని రాంచిలో 1981 జూలై లో శిపాన్ సింగ్, దేవకీదేవి కి ధోని పుట్టారు. ధోని అన్నయ్య పేరు నరేంద్రసింగ్ ధోని. అక్క పేరేమో జయంతిగుప్తా. శిపాన్ సింగ్ చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. అయితే ధోని మాత్రం చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనే అనుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం తో కలగానే ఉండిపోతుందేమో అనుకున్నాడు. టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. అయినా కూడా ధోని మనసులో ఏదో వెలితి ఉండేది. ఈ టైం లో ధోనికి అక్క జయంతి గుప్తా అండగా నిలబడింది.
Advertisement
తల్లిదండ్రులకు కూడా ఆమెనే నచ్చచెప్పింది. ఆమె ఎప్పుడు కూడా ధోనికి ఎలాంటి సాయం కావాలన్నా ముందుండేది. అలా ఆమె నిలబడడం వల్లే ఆటగాడిగా, నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెయ్యి కోట్లకు అధిపతిగా ధోని రికార్డు సృష్టించాడు. అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు ధోని. ధోని అక్క జయంతి గుప్తా రాంచిలోని పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తోంది. ధోని ప్రాణ స్నేహితుల్లో ఒకరైన గౌతమ్ గుప్తాను ఆమె పెళ్లి చేసుకుంది.
Also read: