Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసులో ఓవైపు కోర్టులో వాదనలు కొనసాగుతుండగా.. ఇంకోవైపు బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓసారి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం..
Advertisement
మల్లారెడ్డి, మంత్రి
రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారు. మేము దొంగ దందాలు చేయడం లేదు. ఉద్దేశపూర్వకంగానే నాతో పాటు నా బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నా కుమారుడిని వేధించడంతోనే ఆస్పత్రి పాలయ్యాడు. సోదాల పేరుతో దౌర్జన్యం చేయడం సరికాదు.
Advertisement
రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే
ఐటీ దాడులకు రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం కరెక్ట్ కాదు. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోంది. ఐటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుంది. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారు.
కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారు. ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణ మంత్రులను ఇబ్బంది పెడుతున్నారు. దాడులకు మేము భయపడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారు. ప్రజలను నమ్మించేందుకు సభలు పెట్టి ఏడుస్తున్నారు. బీఎల్ సంతోష్ పై కేసులు పెడితే విచారణ చేయవద్దని కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు. తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలకు భయం ఎందుకు.