Advertisement
ప్రధానితో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ కావడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కొత్త వాదనను తీసుకొచ్చి నవ్వులపాలైంది. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లన్నీ కేటీఆర్ డైరక్షన్ లో పని చేస్తున్నవే. అయితే, ఈ సోషల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
రేవంత్ ప్రధానితో భేటీ అయ్యాడంటే..ఖచ్చితంగా రాజకీయాలు చర్చించి ఉంటారని కవిత భావించినట్టు ఉన్నారు. అందుకే.. దుబాయ్ ల్ కేదార్ హత్య, రాజలింగమూర్తి హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ,బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారనేది కవిత ఆరోపణ.
Advertisement
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ మాట్లాడిన రెండు రోజులకే ప్రధానితో భేటీ అంటే కల్వకుంట్ల కుటుంబం టార్గెట్ గా రాజకీయం ఉంటుందిని కవిత అంచనా వేస్తున్నారు. మోడీతో భేటీ అనంతరం సంబంధం లేకుండా రేవంత్ మాట్లాడారంటే మాపై ఎదో కుట్ర జరుగుతుందనేందుకు ఇదే సంకేతం అని పొలిటికల్ సిగ్నల్స్ గురించి చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలపై కవిత అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. కాని, కేటీఆర్ డైరక్షన్ లో సాగే సోషల్ మీడియా అంతా పాలిటిక్స్ పక్కనపెట్టేసి పసలేని వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. దీంతో..కవిత గ్రహిస్తున్నారు..కేటీఆర్, హరీష్ రావులు ప్రస్తుత రాజకీయాలను అంచనా వేయడంలో ఫెయిల్ అవుతున్నారనే మాట వినిపిస్తోంది.