Advertisement
టాలీవుడ్ లో కొందరు కమెడియన్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ల కామెడీ టైమింగ్ కు అంతా ఫిదా అవుతూ ఉంటారు. చిత్ర సీమలో హాస్యనటుడిగా ముఖ్యంగా గుర్తింపు పొందింది ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఎదురైనా.. అందరూ టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం. అయితే.. బ్రహ్మానందం ను మించిన రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ కమెడియన్ ఒకరున్నారు. ఆయనే దివంగత నటుడు ఎమ్మెస్ నారాయణ. ఈయన అసలు పేరు మైలవరపు సత్యనారాయణ. తాగుబోతు క్యారెక్టర్లు ఎక్కువ పోషించిన ఈ కమెడియన్.. తాగుబోతులా నటిస్తూ ప్రేక్షకులను నవ్వించారు.
Advertisement
Advertisement
ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించినప్పటికీ.. దుబాయ్ శీను సినిమాలో చేసిన కామెడీ క్యారెక్టర్ మాత్రం ఎంతో మందిని అలరించింది. ఈ చిత్రం విడుదలయి ఇప్పటికి 14 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ అలరిస్తూనే ఉందని చెప్పాలి. బుల్లితెర పైనే కాదు.. యూట్యూబ్ లో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం దుబాయ్ శ్రీను. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2007వ సంవత్సరం జూన్ 7న విడుదలైంది.
ఈ చిత్రంలో ఓ ముసలి హీరోగా ఎమ్మెస్ నారాయణ కామెడీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. హీరో సాల్మన్ రాజుగా కెమెరా ముందు ఫోజులు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే హీరోగా ఎమ్మెస్ నారాయణ నటించారు. అయితే ఈ క్యారెక్టర్ ఓ టాప్ హీరో ఇమిటేషన్ అని చాలామందికి తెలియకపోవచ్చు. తెలుగులో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా వాయిస్ ని ఎమ్మెస్ నారాయణ దుబాయ్ శీను సినిమాలో ఇమిటేట్ చేశారు. ఈ సినిమా ఆయనకి ఎంతో గుర్తింపుని తెచ్చి పెట్టిందని ఆయన తెలిపారు. పేరడీలు చేసినప్పటికీ నెగిటివ్ గా ఎవరు స్పందించలేదని.. అది తన అదృష్టమని తెలిపారు.
Read also: మగధీర మూవీలో ఈ సీన్ చూసినప్పుడు మీకు ఇదే డౌట్ వచ్చిందా..?