Advertisement
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పలు సినిమాలు నటించినా కానీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేక పోయారు. తనకు సినిమాలు కలిసి రావడం లేదని రాజకీయాల్లో రాణించాలని లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మొదటి రోజు పాల్గొన్న తారకరత్న గంటలోపే అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పవచ్చు.
Advertisement
Also Read:తారకరత్న మరణాన్ని దాచారంటూ సంచలన కామెంట్స్ చేసిన లక్ష్మీపార్వతి..!!
ఈ విధంగా తారకరత్న మరణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ తరుణంలోనే ఒక వార్త వినిపిస్తోంది.. అయితే తారకరత్న ఇండస్ట్రీ లోకి రావడం వెనక పెద్ద కుట్ర జరిగిందని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. నందమూరి కుటుంబీకులే తారకరత్న ఇండస్ట్రీకి తీసుకువచ్చి, ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ ను తొక్కేయడానికి పెద్ద కుట్ర చేశారని సమాచారం. అప్పట్లో ఎన్టీఆర్ ను నందమూరి వారసుడిగా యాక్సెప్ట్ చేయలేదని , నందమూరి ఫ్యామిలీ ఆయన ఇండస్ట్రీలో లేకుండా చేయడం కోసం తారక రత్నకు 9 సినిమా అవకాశాలు వచ్చేలా చేశారని టాక్ వినిపిస్తోంది.
Advertisement
ప్రధానంగా ఎన్టీఆర్ ను తొక్కేయడానికి తారకరత్నను రంగంలోకి దింపారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారకరత్న ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ ను తొక్కియ్యడానికి ఇండస్ట్రీలోకి వచ్చాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.. నేను ఇండస్ట్రీలోకి రాకముందే ఎన్టీఆర్ ఆది వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారని అన్నారు. తారక్ మా కుటుంబంలో ఓ వ్యక్తిగా ఇండస్ట్రీలో ఎదగడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, నందమూరి వంశాన్ని తాత పేరును ముందుకు తీసుకెళ్లడం సంతోషకరమని ఆయన గర్వంగా చెప్పారు.
Also read: శివరాత్రి పర్వదినాన మరణిస్తే మరో జన్మ ఉంటుందా.. తారకరత్న విషయంలో..!!