Advertisement
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న మరణం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే తారకరత్న చనిపోవడం చాలా బాధాకరం. దాదాపు 23 రోజులపాటు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు.
ఆయన మరణ వార్తతో ఒక్కసారిగా తెలుగు ప్రజలందరూ షాక్ కి గురయ్యారు. తారకరత్న గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read also: అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?
Advertisement
తారకరత్న కి భారీగా ఆస్తులు ఉన్నాయని కొంతమంది సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుండగా.. మరికొందరు మాత్రం తారకరత్న కి ఎలాంటి ఆస్తులు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నందమూరి ఫ్యామిలీలో ట్రస్టులు పెట్టి సేవా కార్యక్రమాలు చేశారని ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికీ నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. నందమూరి బాలకృష్ణ బసవతారం ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తారకరత్న – అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం వల్ల తండ్రి తన ఆస్తులను కూతురు అయిన రూపకు రాశారని తెలుస్తోంది.
Read also: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?

Nandamuri Tarakaratna father
ఈ ఆస్తిలో తారకరత్న వాటాను తారకరత్న ట్రస్ట్ కు ఉపయోగించాలని భావిస్తున్నారని బొగట్ట. అయితే ఇలా చేస్తే మాత్రం అలేఖ్య రెడ్డికి ఆస్తిలో వాటా దక్కదు. అలేఖ్య రెడ్డి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య జోక్యం చేసుకొని అలేఖ్య, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న పిల్లల బాధ్యతను చూసుకుంటానని బాలయ్య ముందుకు వచ్చారు. వారి చదువులు, పెళ్లిళ్లు, లైఫ్ లో సెటిల్ అయ్యేవరకు తాను చూసుకుంటానని బాలకృష్ణ అలేఖ్య రెడ్డికి హామీ ఇచ్చారట.
Advertisement
Read also: Telugu News, Tollywood Cinema News